Ship Sinks In Sea : సముద్రంలో కార్గో షిప్ మునిగి 8 మంది మృతి

ఒక కార్గో షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. జపాన్, దక్షిణ కొరియా మధ్య సముద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Ship Sinks In Sea : ఒక కార్గో షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. జపాన్, దక్షిణ కొరియా మధ్య సముద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హాంకాంగ్ కంపెనీకి చెందిన 6,551 టన్నుల బరువు ఉన్న జిన్ టియాన్ రవాణా నౌక.. డిసెంబర్ 3వ తేదీన మలేషియాలోని పోర్ట్ క్లాంగ్ నుంచి బయలు దేరింది.

కలప లోడ్ తో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ పోర్టుకు వెళ్తోంది. అయితే బుధవారం తెల్లవారుజామున జపాన్ లోని నాగసాకికి నైరుతి దిశలో 160 కిమీ దూరంలో ఈ కార్గో షిప్ మునిగిపోయింది. ఆ సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 14 మంది చైనీయులు, 8 మంది మయన్మార్ కు చెందిన వారు ఉన్నారు.

Syria Boat Capsize : తీవ్ర విషాదం.. సముద్రంలో పడవ మునిగి 77మంది దుర్మరణం

కార్గో షిప్ ప్రమాద సమాచారం తెలుసున్న జపాన్, దక్షిణ కొరియా కోస్ట్ గార్డ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఐదుగురు సిబ్బందిని కాపాడారు. వీరిలో నలుగురు చైనీయులు. 6 మంది చైనీయులు సహా 8 మంది సిబ్బంది మృతి చెందారు. మరో 9 మంది గల్లంతయినట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు