Plane Crashes In Colombia
Plane Crashes In Colombia : ఎనిమిదిమందితో ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానం ఓ భవనంపై కుప్పకూలింది. సోమవారం (నవంబర్ 21,2022)కొలంబియాలోని రెండో అతిపెద్ద నగరం మెడెలిన్‌లో జరిగిన ఈ ఘటనలో ఎనిమిదిమంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
ఒలాయా హెర్రెరా విమానాశ్రయం నుంచి ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో బయలుదేరిన విమానం.. ఇంజిన్ లో తలెత్తిన వైఫల్యంతో ఓ భవనంపై కుప్పకూలినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు మెడెలిన్ మేయర్ డేనియల్ క్వింటెరో చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.