US Mud Run
US Mud Run : ఆమె వయసు 84 ఏళ్లు.. మడ్ రన్‌లో పార్టిసిపేట్ చేసింది. ఎంతో క్లిష్టమైన సవాళ్లను దాటి అందరితో ఔరా అనిపించుకుంది. ఈమెను చూస్తే వయసు అనేది జస్ట్ నంబర్ మాత్రమే అనిపించి తీరుతుంది.
Mumbai Police : తన ఫ్యామిలీ వద్దకు చేర్చమంటూ పోలీసులను ఆశ్రయించిన వృద్ధురాలు.. పోలీసులు ఏం చేశారంటే?
US మిస్సౌరీకి చెందిన 84 ఏళ్ల మిల్డ్రెడ్ విల్సన్ అనే వృద్ధురాలు మడ్ రేసులో పాల్గొంది. మడ్ రేస్‌లో ఒక్కో విభాగం ఎంత టఫ్‌గా ఉన్నా అలవోకగా వాటిని అధిగమించింది. అడుగు తీసి అడుగు పడని వయసులో బురదలో పరుగులు పెడుతూ, పాకుతూ, దొర్లుతూ రన్‌లో ఆమె పాల్గొన్న తీరు నిర్వాహకుల్నిఅబ్బురపరిచింది. ఇంక నిర్వాహకులు సైతం ఆమెను ప్రోత్సహించిన తీరు అభినందించాల్సిందే. @GoodNewsMVT అనే ట్విట్టర్ యూజర్ ద్వారా ఈ రన్‌కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.’84 ఏళ్ల మిల్డ్రెడ్ విల్సన్ అతి కష్టమైన 4వ మడ్ రేసును విజయవంతంగా పూర్తి చేసారు. వయసు అనేది జస్ట్ నంబర్ మాత్రమే’ అనే శీర్షికతో షేరైన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Viral Video: పింఛను కోసం చెప్పులు లేకుండా ఎండలో కొన్ని కిలోమీటర్లు నడిచిన వృద్ధురాలు
భర్త ఫారెల్ జాపకార్థం తాను ఈ రేసులో పాల్గొంటున్నట్లు మిల్డ్రెడ్ విల్సన్ చెబుతోంది. తాను ఆరోగ్యంగా ఉన్నంతకాలం రేసులో పాల్గొంటానని అంటోంది. తన భర్తను కోల్పోయిన బాధ నుంచి బయటపడటం కోసం.. తను ఫిజికల్ గా ఫిట్ గా ఉండటం కోసం కూడా ఈ రేసులో పాల్గొంటోందట. ఏది ఏమైనా మిల్డ్రెడ్ విల్సన్ ధైర్యానికి, అభిరుచికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Mildred Wilson recently completed her 4th Tough Mudder in Missouri at 84 years old!
AGE IS JUST A NUMBER!
(?:@ToughMudder) pic.twitter.com/ljvHy1P8uI— GoodNewsMovement (@GoodNewsMVT) May 3, 2023