వందల మంది గల్లంతు : ఆనకట్ట కూలి 9మంది మృతి

  • Publish Date - January 26, 2019 / 07:51 AM IST

బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. అగ్నేయ బ్రెజిల్ లోని బ్రుమదిన్హో టౌన్ లో  శుక్రవారం (జనవరి 26,2019) బెలో హారిజాంటే ప్రాంతంలో  మైనింగ్ డామ్  ఆనకట్ట కూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది చనిపోగా.. 300 మంది మిస్ అయ్యారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గల్లంతైనవారి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఇప్పటివరకు 9 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.

బ్రెజిల్‌లోని మైనింగ్‌ దిగ్గజం వాలే కంపెనీ వ్యర్థపదార్థాలను వేసేందుకు ఈ డ్యామ్‌ను నిర్మించింది. శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఈ డ్యామ్‌ ఆనకట్ట కూలింది. దీంతో భారీ ఎత్తున బురద వరదలా పొంగి ఓ భవన సముదాయాన్ని ముంచెత్తింది.  ఈ భవనంలో 300 మందికి పైగా గని కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా బురదలో గల్లంతయ్యారు. కార్లు, బస్సులు వరదలో కొట్టుకుపోయాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు