న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 50కి చేరింది.
న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 50కి చేరింది. శుక్రవారం ఉదయం (మార్చి 15, 2019) దుండగులు మారణ ఆయుధాలతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో మసీదులో ప్రార్థన చేస్తున్న వారిలో 40మందికిపైగా మృతిచెందారు. ఈ ఘటన జరిగిన తర్వాత తొమ్మిది మంది భారతీయులు (భారత సంతతికి చెందిన) అదృశ్యమయ్యారు. ఈ మేరకు న్యూజిలాండ్ లోని భారతీయ రాయబారి ఒకరు తెలిపారు. కాల్పుల ఘటనపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇద్దరు భారతీయులు మృతిచెందారని, మూడో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.
Read Also: న్యూజిలాండ్ కాల్పుల్లో 40కి పెరిగిన మృతులు
క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 49 మంది మృతిచెందగా, 20మంది వరకు తీవ్రగాయాలపాలైన సంగతి తెలిసిందే. శుక్రవారం కావడంతో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్దనలకు వచ్చారు. దుండగుల కాల్పుల ఘటనను ఉగ్రదాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. కాల్పుల ఘటనతో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. శాంతిదేశంగా పిలుచుకునే న్యూజిలాండ్ లో ఇలాంటి ఘటన జరగడం దేశంలో ఇదొక చీకటి రోజుగా ప్రధాని జెసిండా అడ్రెర్న్ అభివర్ణించారు.
కాల్పుల ఘటన సమయంలో ఒక మసీదులో 300మంది వరకు ఉన్నారని చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మసీదులో మృతదేహాలు పడి ఉన్నాయి. ఒంటినిండా ఆయుధాలతో ఉన్న ఓ వ్యక్తి మసీదులోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ.. న్యూజిలాండ్ ప్రధానికి లేఖ ద్వారా తెలియజేసినట్టు విదేశీ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాల్పుల ఘటన తర్వాత 9 మంది భారతీయులు అదృశ్యమయ్యారనే దానిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
We are shocked to hear about the shooting in #Christchurch Any Indians needing assistance should contact us at 021803899 or 021850033. @indianweekender @indiannewslink @MEAIndia @IndianDiplomacy @WIAWellington @kohli_sanjiv @BhavDhillonnz
— India in New Zealand (@IndiainNZ) March 15, 2019
Indian shot in New Zealand mosque attack, his Hyderabad family seeks urgent visa https://t.co/2Q8EYFnZ6F
— Asaduddin Owaisi (@asadowaisi) March 15, 2019
A video from #ChristChurch shows one Ahmed Jehangir who was shot. His brother Iqbal Jehangir is a resident of Hyderabad & would like to go to NZ for Ahmed’s family.
I request @KTRTRS @TelanganaCMO @MEAIndia @SushmaSwaraj to make necessary arrangements for the Khursheed family
— Asaduddin Owaisi (@asadowaisi) March 15, 2019