తొమ్మిది సంవత్సరాల పిల్లాడి కోసం ఏకంగా 5వేలమంది పోటీ పడ్డారు. ఆ పిల్లాడు మాకు కావాలంటే మాకు కావాలని పోటీపడ్డారు. కానీ వారిలో ఎవరికి ఆ పిల్లాడిని అప్పగించాలనే విషయంపై కొంతమంది దీర్ఘాలోచనలో పడ్డారు. ఎవరికి ఇస్తే ఆ బాబు జీవితం..భవిష్యత్తు బాగుంటుంది? అని ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు? ఎందుకు పోటీ? అనే విషయం తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళితే…అది అమెరికాలోని ఓక్లామా ప్రాంతం. జోర్డాన్ అనే తొమ్మిదేళ్ల పిల్లాడు అతని తమ్ముడు తల్లిదండ్రుల్ని కోల్పోయారు. జోర్ధాన్న తన తమ్ముడితో కలిసి అనాథాశ్రమంలో ఉంటున్నాడు. అమ్మానాన్నలు లేరు కదాని జోర్థాన్ ఏమాత్రం అధైర్యపడలేదు.ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. తమకు మంచి భవిష్యత్తు దొరుకుతుందనే ఆశతోనే ఉన్నాడు.
ఈ క్రమంలో జోర్డాన్ తమ్ముడిని ఓ కుటుంబం దత్తత తీసుకుని తీసుకెళ్లిపోయింది. తమ్ముడు దూరం అవుతున్నాడనే బాధకంట తమ్ముడికి ఓ కుటుంబం దొరికిందనే సంతోషించాడు జోర్ధాన్. దీంతో జోర్డాన్ ఒంటరివాడయ్యాడు. నాకు కూడా ఓ మంచి కుటుంబం కావాలనుకున్నాడు.
దీంతో ..కేఎఫ్‌ఓఆర్ వీక్లీ సిరీస్ నిర్వహించే ప్రోగ్రామ్ లో ‘ఏ ప్లేస్ టు కాల్ హోమ్’అనే లైవ్ షోలో పాల్గొని నాకు ఓ కుటుంబం కావాలి అంటూ కోరాడు. నాకంటూ ఓ కుటుంబం ఉంటే ఎంతో సంతోషిస్తానని.. కుటుంబం కోసం తాను ఎంత ఆత్రంగా..ఆశగా ఎదురు చూస్తున్నానని కోరారు.
ఈ లైవ్ షోలో జోర్డాన్ బాధను చూసిన చాలా మంది భావోద్వేగానికి లోనయ్యారు. అంతే ..జోర్థాన్ ఉంటున్న అనాథాశ్రమానికి అప్లికేషన్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. మాకు జోర్ధాన్ కావాలి..ఇంత చిన్న వయస్సులో కుటుంబం అంటే ఏమిటో ..కుటుంబం విలువ తెలిసిన జోర్థాన్ తపన మమ్మల్ని ఎంతో కదిలించింది..అంటూ లెటర్లతో పాటు అప్లికేషన్లు పంపించారు. అలా జోర్డాన్ కోసం ఐదు వేల అప్లికేషన్లు వచ్చాయి.
‘ప్రస్తుతం జోర్డాన్‌ను పంపించే కుటుంబం గురించి ఆలోచిస్తున్నామని..వచ్చిన అప్లికేషన్లను పరిశీలిస్తున్నామని అనాథాశ్రమ నిర్వాహకులు తెలిపారు. గతంలో చాలా మంది జోర్డాన్‌ను దత్తత తీసుకెళ్లారు. కానీ..మళ్లీ తిరిగి తీసుకొచ్చి అనాథాశ్రమంలో వదిలేశారు..కానీ ఈసారి మాత్రం అలా కాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ జోర్డాన్ ఉంటున్న అనాథ ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. జోర్డాన్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జోర్ధాన్ కు మంచి కుటుంబం దొరకాలని కోరుకుందాం..