Boy Died Of Heart Attack
America Boy Died Of Heart Attack : కరోనా అనంతరం వయసుతో నిమిత్తం లేకుండా గుండె పోటు ఘటనలు పెరిగి పోయాయి. యువకులు, మధ్య వయస్కులు, పిల్లలు సైతం గండె పోటుతో హఠన్మరణం చెందుతున్నారు .తాజాగా అమెరికాలోని ఫ్లోరిడాలో 14 ఏళ్ల బాలుడు గుండె పోటుతో మృతి చెందాడు. స్కూల్ లో నిర్వహించిన 5 కే రేస్ లో పాల్గొన్న నాక్స్ మాక్ వెన్ అనే బాలుడు గుండె పోటుతో కుప్పకూలాడు. వెంటనే స్కూల్ కు చేరుకున్న ఎమర్జెన్సీ బృందం బాలుడిని కాపాడే ప్రయత్నం ఫలించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
డేవిస్ వెస్ట్రన్ హైస్కూల్ లో చదువుతున్న బాలుడు జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్ డ్రిల్ లో పాల్గొంటూ ప్రాణాల మీదికు తెచ్చుకున్నాడు. బాలుడు కుటుంబ స్నేహితుడు గోఫండ్ మి క్యాంపెయిన్ చేపట్టగా అంత్యక్రియల నిర్వహణకు 66 వేల డాలర్టు సమకూరాయి. బాలుడి మృతి పట్ల స్కూల్ ప్రిన్సిపాల్ విచారం వ్యక్తం చేశారు. రన్నింగ్ చేస్తూ మాక్ వెన్ కుప్పకూలడం దురదృష్టకరమన్నారు. బాలుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Heart Attack Cases : కొవిడ్ రోగులకు గుండెపోటు ఎందుకు వస్తుందంటే…ఐసీఎంఆర్ పరిశోధనల్లో తేలిన నిజం
బాలుడి తల్లి జూలీ గతేడాది క్యాన్సర్ బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా ఇప్పుడు కొడుకు గుండె పోటుతో మరణించడం అందరి హృదయాలను కలిచివేస్తోంది. గత కొన్ని నెలల క్రితం అమెరికాలో 17 ఏళ్ల బాస్కెట్ ప్లేయర్ తన టీమ్ తో కలిసి వర్క్ అవుట్ సెషన్ లో పాల్గొంటూ కుప్పకూలిపోయాడు. ఇక జిమ్ లలో వ్యాయామం చేస్తూ పలువురు గుండెపోటుకు గురై మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి.