Russian shelling: యుక్రెయిన్ పై మరోసారి రష్యా దాడి… 10 మంది మృతి.. 20 మందికి గాయాలు

రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా యుక్రెయిన్ పై రష్యా ధాడులు చేసి పది మంది ప్రాణాలు తీసింది. మరో 20 మంది ప్రజలు గాయపడ్డారు. ఈ విషయాన్ని గురించి తెలుపుతూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఓ ప్రకటన చేశాడు.

Russian shelling: రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా యుక్రెయిన్ పై రష్యా ధాడులు చేసి పది మంది ప్రాణాలు తీసింది. మరో 20 మంది ప్రజలు గాయపడ్డారు. ఈ విషయాన్ని గురించి తెలుపుతూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఓ ప్రకటన చేశాడు.

ఇటీవలే యుక్రెయిన్ పై రష్యా చేసిన క్షిపణి, డ్రోనుల దాడులను మరవక ముందే రష్యా మళ్ళీ దాడులు చేయడం గమనార్హం. దొనేత్సక్ ప్రాంతంలో ఆరుగురు, ఖెర్సన్ లో ఇద్దరు, ఖర్కివ్ లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఉక్రయిన్ కు శక్తిమంతమైన యుద్ధ ట్యాంకులు పంపుతామని అమెరికా, రష్యా ప్రకటన చేసిన నేపధ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ దాడులు జరగడం గమనార్హం.

రష్యా చేస్తున్న దాడులను యుక్రెయిన్ పశ్చిమ దేశాల సాయంతో ఎదుర్కొంటోంది. ఇప్పటికే యుక్రెయిన్ కు అమెరికా పలు దశల్లో భారీగా ఆయుధ, సాంకేతిక సాయం చేసింది. ఆలాగే ఇతర దేశాలు మిలిటరీ సాయాన్ని చేశాయి. రష్యా, యుక్రేయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తాము రష్యాకు ఎట్టి పరిస్థితిల్లోను లొంగబోమని యుక్రెయిన్ అంటోంది.
Ranbir kapoor : సెల్ఫీ అడిగాడని అభిమాని ఫోన్ విసిరేసిన రణబీర్..

ట్రెండింగ్ వార్తలు