earthquakes
Series Of Earthquakes : వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. టర్కీ, సిరియాలో భూకంపాలు సంభవించిన తర్వాత పలు దేశాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు మూడు రోజులకొకసారి ఏదో ఒక చోట భూకంపం సంభవిస్తుంది. తాజాగా ఆప్ఘనిస్తాన్, తజకిస్థాన్ లో భూకంపాలు సంభవించాయి. రెండు దేశాల్లో గంటన్నర వ్యవధిలో వరుస భూ ప్రకంనలు చోటు చేసుకున్నాయి.
మంగళవారం తెల్లవారుజామున 4.05 గంటల సమయంలో ఆప్ఘనిస్తాన్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలనీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంనలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. ఫైజాబాద్ కు 315 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది.
Earthquake : మణిపూర్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.2గా నమోదు
ఆప్ఘనిస్తాన్ లో భూకంపం వచ్చిన గంటన్నర వ్యవధిలోనే తజకిస్థాన్ లోనూ భూ కంపం సంభవించింది. తెల్లవారుజామున 5.31 గంటలకు తజకిస్థాన్ లో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 గా నమోదైందని నేషనల్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. రెండు దేశాల్లోనూ తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 23న తజకిస్థాన్ లో 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దేశంలో గత ఐదు రోజుల వ్యవధిలో భూకంపం సంభవించడం ఇది మూడోసారి.