Sikh Man Shot Dead: అమెరికాలో సిక్కు యువకుడిని కాల్చి చంపిన పోలీసులు.. నడిరోడ్డుపై అలా చేయడంతో..

వెంటనే అక్కడికి వెళ్లాము. అతడిని అదుపు చేసే ప్రయత్నం చేశాము. కానీ, అతను ఒప్పుకోలేదు. పైగా మాపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. (Sikh Man Shot Dead)

Sikh Man Shot Dead: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిక్కు యువకుడిని పోలీసులు కాల్చి చంపేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సిక్కు యువకుడిని గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. అతడి వయసు 35 సంవత్సరాలు. లాస్ ఏంజిల్స్ లో నడిరోడ్డుపై గురుప్రీత్ సింగ్ కత్తితో హల్ చల్ చేశాడు. కత్తితో రోడ్లపై గట్కా ప్రదర్శించాడు (గట్కా ఒక ప్రాచీన సంప్రదాయ మార్షల్ ఆర్ట్). కత్తిని తిప్పుతూ స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాడు. ఆ తర్వాత కారుని ప్రమాదకరంగా నడిపాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గురుప్రీత్ ను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే గురుప్రీత్ మరింత రెచ్చిపోయాడు. పోలీసుల కారుపైకి కత్తితో దూసుకెళ్లాడు. దాంతో పోలీసులు అతడిని కాల్చి చంపారు. ఆత్మరక్షణలో భాగంగానే గురుప్రీత్ ను కాల్చినట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటన జూలైలో జరిగింది. దీనికి సంబంధించిన ఫుటేజ్ ని లాస్ ఏంజిల్స్ పోలీసులు తాజాగా రిలీజ్ చేశారు. ”లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లోని క్రిప్టో.కామ్ అరీనా సమీపంలో గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తి కత్తితో రోడ్డుపై ఉన్నట్లు మాకు తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లాము. అతడిని అదుపు చేసే ప్రయత్నం చేశాము. కానీ, అతను ఒప్పుకోలేదు. పైగా మాపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆత్మరక్షణలో భాగంగా అతడిపై కాల్పులు జరిపాం” అని లాస్ ఏంజిల్స్ పోలీసులు వివరించారు.

గట్కా.. పంజాబ్ లో ప్రదర్శించే ఒక సంప్రదాయ, ప్రాచీన మార్షల్ ఆర్ట్. ఇందులో పలు రకాల ఆయుధాలను (కత్తులు, కర్రలు, ఈటెలు, కవచాలు వంటివి) ఉపయోగిస్తారు. గట్కా.. సాధారణంగా సిక్కు మత, సాంస్కృతిక పరమైన కార్యక్రమాల్లో ప్రదర్శిస్తారు.

Also Read: ఈ లక్షణాలు కనిపించాయా? బీకేర్ ఫుల్.. మీరు ప్రీ-డయాబెటిక్ అని సూచించే 6 సంకేతాలు ఇవే..!