Geminids Meteor Shower : ఈరోజు ఆకాశంలో అద్భుతాన్ని మిస్ అవ్వొద్దు.. భూమికి అత్యంత సమీపంగా జెమినిడ్స్‌ ఉల్కాపాతం

ఈరోజు ఆకాశంలో అద్భుతాన్ని మిస్ అవ్వొద్దు అని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. భూమికి అత్యంత సమీపంగా జెమినిడ్స్‌ ఉల్కాపాతాన్ని టెలిస్కోప్ లేకుండానే ప్రత్యక్షంగా చూడొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సో డోంట్ మిస్..

Geminids Meteor Shower

Geminids Meteor Shower : ఈరోజు రాత్రి అంటే బుధవారం (డిసెంబర్ 14,2022) రాత్రి ఆకాశంలో అత్యద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది..మిస్ అవ్వకుండా అందరు చూడాలని సూచిస్తున్నారు ఖగోళశాస్త్రవేత్తలు. ఈరోజు రాత్రి జెమినిడ్స్‌ ఉల్కాపాతం భూమికి అత్యంత సమీపంగా రానుంది. టెలిస్కోప్‌ అవసరం లేకుండానే చూడొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ సంవత్సరంలో అత్యుత్తమ ఉల్కాపాతం అని చెప్పే ఈ జెబినిడ్స్ ఉల్కాపాతం ఈ ఏడాదిలో ఇదే చివరిది.

డిసెంబర్ 4వ తేదీ నుంచి ఆకాశంలో కనిపిస్తున్న ‘జెమినిడ్స్‌’ ఉల్కాపాతం బుధవారం రాత్రి గరిష్ఠస్థాయికి చేరుకోనుంది. గరిష్ఠంగా గంటకు 150 ఉల్కలతో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఇది అందంగా కనిపిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. జెమినిడ్స్‌ ఉల్కాపాతం శిథిలాలు సెకనుకు 70 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించే సందర్భంలో మండిపోతూ ప్రకాశంగా కనిపించి కనువిందు చేయనున్నాయి.

వీటిని టెలిస్కోప్‌ లేకుండానే వీక్షించే అవకాశం ఉందని..భూమిమీద ఎక్కడినుంచైనా చూడవచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని ప్రత్యక్షంగా చూసినా ఎటువంటి ప్రమాదం ఉండదని కాబట్టి ఈ అదర్భుతాన్ని ప్రజలు అంతా చూసి ఆనందించవచ్చని సూచిస్తున్నారు. బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఉల్కాపాతం గరిష్ఠ స్థాయిని చేరుకొంటుందని..రాత్రి 9 గంటలకు దీన్ని మరింత స్పష్టంగా వీక్షించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆకాశంలో ఈ మహాద్భుతాన్ని వీక్షించే అవకాశాన్ని ఎవరూ మిస్‌ కావద్దని ఖగోళనిపుణులు సూచించారు. డిసెంబర్ 13 మంగళవారం రాత్రి 11 గంటలకు ప్రారంభమై ఈ ఉల్కాపాతం బుధవారం ఉదయం 3 గంటల వరకు కనిపిస్తుందని చెబుతున్నారు.