Strange Fish : చేతులు కలిగిన వింత చేప.. ఆస్ట్రేలియా బీచ్ లో దర్శనం

ఈ వింత చేప జాతి చాలా పురాతనమైందని, ఇప్పుడు అవి అంతరించిపోతున్న దశలో ఉన్నాయని జీవ శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరించిపోతున్న సముద్ర జీవుల్లో ఈ వింత చేపలే ముందున్నాయని చెబుతున్నారు.

Strange Fish With Hands : ఆస్ట్రేలియా  ఓ వింత చేప దర్శనమిచ్చింది. వాజాలకు బదులుగా చేతులు కలిగిన వింత చేప కనిపించింది. దాని పొట్ట కింద పూర్వ వాజాలకు బదులుగా రెండు చేతులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని టస్మానియా బీచ్ లో కెర్రీ యారే అనే మహిళ ఈ వింత చేపను గుర్తించారు. తాను బీచ్ లో పరుగెత్తుతుండగా ఇసుకపై ఒక చేప కనిపించిందని, సాధారణ పఫర్ ఫిష్ అనుకుని మరింత దగ్గరికి వెళ్లి చూడగా ఇసుకలో దాని కాళ్లు కనిపించాయని కెర్రీ వెల్లడించారు.

కాగా, ఈ వింత చేప జాతి చాలా పురాతనమైందని, ఇప్పుడు అవి అంతరించిపోతున్న దశలో ఉన్నాయని జీవ శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరించిపోతున్న సముద్ర జీవుల్లో ఈ వింత చేపలే ముందున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద వీటి జనాభా 2 వేలకు మించి ఉండదని అంటున్నారు.

Alligator Gar Fish : బాబోయ్ ఎంత భయంకరంగా ఉందో.. వలకు చిక్కిన వింత చేప, అచ్చం మొసలిలా ఉంది

అయితే ఈ అరుదైన జాతి చేపలు అంతరించిపోకుండా రక్షించుకోవడానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ చేపలు తన చేతులను సముద్రం ఉపరితలంపైన, ఒడ్డున ఇసుకపై నడపడానికి ఉపయోగించుకుంటాయని తెలిపారు. సాధారణంగా చేపలతో చలనాంగాలుగా వాజాలు తోడ్పడుతాయి.

చేప ఈదడానికి, నీటిలో కిందికి పైకి వెళ్లడానికి, నీటి నడుమ కదలకుండా సమతాస్థితిలో ఆగడానికి, తాను ప్రయాణిస్తున్న దిశను మార్చుకోవడానికి ఈ వాజాలు తోడ్పడుతాయి. అంతే తప్ప ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లేందుకు వాటికి మనుషుల మాదిరిగా కాళ్లు, చేతులు ఉండవు. కానీ ఆస్ట్రేలియాలో వింత చేపకు దాని పొట్ట కింద పూర్వ వాజాలకు బదులుగా రెండు చేతులు ఉండటం విశేషం.

ట్రెండింగ్ వార్తలు