man eats watermelon slice by sharing it with pet iguana
man eats watermelon slice by sharing it with pet iguana : నీకో ముక్కా నాకో ముక్క అంటూ ఊసరవెల్లితో పుచ్చకాయ షేరింగ్ చేసుకున్నాడో యువకుడు. ఊసరవెల్లి జాతికి చెందిన ఇగ్వానాతో పుచ్చకాయ ముక్కను షేర్ చేసుకున్నాయో యువకుడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సూపర్ వైరల్ గా మారింది.
సాధారణం చాలామంది పిల్లుల్ని, కుక్కల్ని,రామచిలుకలు, కుందేళ్లను పెంచుకుంటుంటారు. మరికొందరు కాస్త డిఫరెంట్ గా పాముల్ని, మొసళ్లను కూడా పెంచుకుంటుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం ఇగ్వానాను పెంచుకుంటున్నాడు. మన పెంపుడు జంతువుల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంటాం కదా..అలా వాటిని ఆటపట్టించటానికి ఆహారాన్ని వాటి ముందే తింటే అవి ఉడుక్కుంటాయి. మనం తినే ఆహారాన్ని లాగేసుకుంటూ ఉంటాయి. మనతో వచ్చి ఆడుతూ ఉంటాయి. ఇవన్నీ కామన్‌గా కుక్కలు, పిల్లులలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ వీడియో మాత్రం చాలా కొత్తగా ఉంది.
ఒక యువకుడు తినే పుచ్చకాయ ముక్కని తినటానికి ఇగ్వానా తెగ ఆరాటపడింది. నాకూ అంటూ వచ్చి పుచ్చకాయ ముక్కను అందుకుని తింటోంది. ఈ వీడియో వింతగా ఉంది ఒక ఇగ్వానాకి తను తినే పుచ్చకాయ ముక్కని షేర్ చేసుకున్నాడు ఒక వ్యక్తి. ఈ వీడియోలో ఒక ఇగ్వానా పుచ్చకాయ ముక్కను తినడం మనం చూడొచ్చు. అతను తింటూ ఉంటే.. వెనకే ఉన్న ఇగ్వానా కూడా ముందుకొచ్చి.. ఓ ముక్కను కొరుక్కుంది. దానికి పుచ్చకాయ రుచి బాగా నచ్చడంతో.. రెండోసారి పెద్ద ముక్కే కొరికింది. ఇలా ఇద్దరూ పుచ్చకాయ ముక్కను తిన్న వీడియో వైరల్ అయ్యింది. దీన్ని ట్విట్టర్ లోని @buitengebieden అకౌంట్‌లో నవంబర్ 2, 2022న పోస్ట్ చెయ్యగా.. ఇప్పటివరకూ.. లక్షల మంది చూశారు. మరి మీరు కూడా ఓ లుక్కేయండీ..
Sharing is caring.. ?
? IG: lizardthebuddy pic.twitter.com/mXUGWjbejl
— Buitengebieden (@buitengebieden) November 2, 2022