Adidas Bra Add
Adidas Bra Add : ప్రముఖ స్పోర్ట్స్ వేర్ ఉత్పత్తుల తయారీ కంపెనీ అడిడాస్ వివాదంలో చిక్కుకుంది. అడిడాస్ రిలీజ్ చేసిన కొత్త స్పోర్ట్స్ బ్రా యాడ్ పై దుమారం రేగింది. దీనికి కారణం అందులోని ఫొటొలే. మహిళల వక్షోజాల ఫొటొలతో అడిడాస్ స్పోర్ట్స్ బ్రా యాడ్ రూపొందించింది. ఈ యాడ్ కాంట్రవర్సీకి కారణమైంది. ఈ బ్రా యాడ్.. నిబంధనలకు విరుద్ధంగా ఉందనే కారణంతో ఆ యాడ్ పై నిషేధం విధించింది బ్రిటన్.
Adidas Bra Add, New Adidas advertisement banned for showing bare breasts
‘వక్షోజాలలో ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీకు సరైన స్పోర్ట్స్ బ్రా అవసరం’ అనేది యాడ్ సారాంశం. ఈ క్రమంలో విభిన్న ఆకృతులు కలిగిన వక్షోజాలు ఉన్న మహిళల నగ్న ఫొటోను ADIDAS కంపెనీ ట్వీట్ చేసింది.
Adidas Bra Add, New Adidas advertisement banned for showing bare breasts
అడిడాస్ కంపెనీ చేసిన ట్వీట్‌లో.. రెండు పోస్టర్లు ఉన్నాయి. అందులో పలు రకాల చర్మ రంగులు, ఆకారాలు, పరిమాణాల్లో పదుల సంఖ్యలో మహిళల నగ్న వక్షోజాల ఫొటోలు కనిపించాయి. ఈ యాడ్ పై బ్రిటన్ వాణిజ్య ప్రకటనల పర్యవేక్షణ సంస్థ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Adidas Bra Add, New Adidas advertisement banned for showing bare breasts
”అన్ని రకాల ఆకారాలు, పరిమాణాల్లోని మహిళల వక్షోజాలకు మద్దతు, సౌకర్యం అవసరమని మేం విశ్వసిస్తాం. అందుకే ప్రతి ఒక్కరూ తమకు సరైన ఫిట్‌ను పొందగలిగేలా మా కొత్త స్పోర్ట్స్ బ్రా శ్రేణిలో 43 స్టైల్స్ ఉన్నాయి” అని ఆ ట్వీట్‌లో రాసింది.
ఈ యాడ్ పై బ్రిటన్ వాణిజ్య ప్రకటనల పర్యవేక్షణ సంస్థ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ ఏజెన్సీకి ఫిర్యాదులు అందాయి. ఇందులో అనవసరంగా నగ్నత్వాన్ని వినియోగించారని, మహిళలను వస్తువు స్థాయికి దిగజార్చారని, వారిని లైంగికీకరించారని, కేవలం శరీర భాగాలకు పరిమితం చేశారని ఆ ఫిర్యాదుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
Adidas Bra Add, New Adidas advertisement banned for showing bare breasts
ఇది ఇలా ఉంటే.. యాడ్ ను అడిడాస్ కంపెనీ ప్రతినిధులు సమర్థించుకున్నారు. ఈ అడ్వర్టైజ్‌మెంట్ సందేశానికి తాము గర్వంగా కట్టుబడి ఉన్నామని అడిడాస్ యూకే అధికార ప్రతినిధి చెప్పారు. అంతేకాదు, ఈ యాడ్ ను అడిడాస్ సంస్థ తన వెబ్‌సైట్‌లో ఇంకా ప్రదర్శిస్తూనే ఉంది.
The @Adidas #tweet and poster for sports bra finally found objectionable and banned by #ASA for explicit Nudity. more on objectionable ad. TOO LATE, https://t.co/S5DYF5V4Cl pic.twitter.com/ufLhJvAOuA
— Sanjeev Kotnala (@S_kotnala) May 12, 2022