Afghan
Taliban: అఫ్ఘాన్‌నిస్థాన్ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో కోట్ల మందికి తినడానికి తిండి లేకుండా పోయింది. బతికే పరిస్థితి కూడా కనిపించట్లేదు. తాలిబాన్ల చేతిలో చిత్తుగా అవుతున్న అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు బయటకు చెబుతోంది ఒకటైతే అక్కడ జరగుతోంది ఒక్కటి. అఫ్ఘాన్‌నిస్థాన్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్న తర్వాత అందరనీ క్షమించేశాం.. ఇస్లాం చట్టాల ప్రకారం మహిళలకు కూడా రక్షణ కల్పిస్తాం అంటూ ప్రకటన కూడా చేసేశారు. కానీ, దేశంలో హింస మాత్రం ఆగట్లేదు.
ఈ క్రమంలోనే ఓ ఆసక్తకర విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంవత్సరం జూన్‌లో నాగ్‌పూర్ నుంచి అఫ్ఘాన్‌నిస్థాన్‌కు బహిష్కరించిన అఫ్ఘాన్ యువకుడు, తాలిబాన్‌లలో చేరినట్లుగా నివేదికలు అందుతున్నాయి. చట్టవిరుద్ధంగా మన దేశంలో ఉంటున్నట్లు గుర్తించిన తరువాత అఫ్ఘానిస్తాన్‌కు చెందిన నూర్ మహ్మద్ అలియాస్ అబ్దుల్ హక్ అనే వ్యక్తిని వారి దేశానికి పంపేశారు. అనంతరం అతను తాలిబన్లలో చేరినట్లుగా తెలుస్తోంది.
సదరు వ్యక్తి చేతిలో రైఫిళ్లతో తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత.. సీనియర్ పోలీసు అధికారి ఈ విషయాన్ని దృవీకరించారు. “నూర్ మహ్మద్ అజీజ్ మొహమ్మద్ (30) అనే వ్యక్తి గత 10 సంవత్సరాల నుంచి నాగ్‌పూర్‌లో చట్టవిరుద్ధంగా ఉంటున్నాడు. అతను నగరంలోని దిగోరి ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు. పక్కా సమాచారంతో అతని కార్యకలాపాలపై నిఘా పెట్టిన పోలీసులు. చివరకు అతడిని పట్టుకుని జూన్ 23 న ఆఫ్ఘనిస్తాన్‌కు బహిష్కరించారు. అతని బహిష్కరణ తర్వాత, అఫ్ఘానిస్తాన్‌కు చేరుకుని తాలిబాన్‌లలో చేరినట్లు తెలుస్తోంది. తుపాకీ పట్టుకుని ఉన్న అతని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2010లో నాగపూర్‌కు ఆరు నెలల టూరిస్ట్ వీసాపై వచ్చిన అతను.. తరువాత, శరణార్థి హోదా కోసం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి (UNHRC) దరఖాస్తు చేసుకున్నాడు, కానీ అతని దరఖాస్తు తిరస్కరించగా.. అప్పటి నుండి, అతను చట్టవిరుద్ధంగా నాగ్‌పూర్‌లో ఉంటున్నట్లు అధికారి వెల్లడించారు. విషయం తెలుసుకుని చివరకు అతనిని అఫ్ఘానిస్తాన్‌కు పంపేశారు.