Afghan New Law : మహిళల కళ్లు మాత్రమే కనిపించాలి..లేదంటే వారి కుటుంబంలో పురుషులకు శిక్షలు తప్పవు : తాలిబన్ల హెచ్చరిక

తాలిబన్లు జారీ చేసిన డిక్రీ...దేశంలో అమ్మాయిల దుస్థితికి అద్దం పడుతోంది. బుర్ఖా ధరించకుండా మహిళలు ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే ఆ కుటుంబంలోని పురుషులు శిక్ష అనుభవించాల్సి వస్తుందని తాలిబన్లు హెచ్చరించారు.

Afghan New Law : అఫ్ఘానిస్తాన్ విషయంలో ప్రపంచం ఏం భయపడిందో అదే జరుగుతోంది…అడుగడుగునా ఆంక్షలతో తాలిబన్లు దేశంలో అరాచకం సృష్టిస్తున్నారు. ఇక మహిళల పరిస్థితైతే మరింత దిగజారింది. వారు అడుగుతీసి అడుగుబయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా తాలిబన్లు జారీ చేసిన డిక్రీ…దేశంలో అమ్మాయిల దుస్థితికి అద్దం పడుతోంది. బుర్ఖా ధరించకుండా మహిళలు ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే ఆ కుటుంబంలోని పురుషులు శిక్ష అనుభవించాల్సి వస్తుందని తాలిబన్లు హెచ్చరించారు.

అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. తాలిబన్ల పాలన అరాచకానికి పరాకాష్టగా మారింది. గత ఏడాది ఆగస్టు 15న తాలిబన్లున కాబూల్‌ను ఆక్రమించుకున్నప్పుడు ప్రజలు ప్రాణాలకు తెగించి మరీ అమెరికా విమానాలు ఎందుకు ఎక్కారో ఇప్పుడు ప్రపంచానికి అర్ధమవుతోంది. దేశంలో తిండానికి తిండి లేదు. ఉపాధి లేదు. పూట గడవడమే కష్టంగా మారిన దుస్థితి. కడపు నింపుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో అప్ఘాన్ పౌరులు అవయవాలు అమ్ముకుంటున్న వార్తలు అందరినీ కలిచివేస్తున్నాయి. పది నెలలుగా పరిస్థితి బాగుపడుతుందేమోనని ఎదురుచూస్తున్నవారికి నిరాశే ఎదురవుతోంది. ప్రజలిన్ని కష్టాల్లో ఉంటే..వారికి కనీస ఆహారం అందించడం, ఉపాధికల్పించడంపై దృష్టిపెట్టకుండా తాలిబన్లు అర్ధం పర్ధం లేని ఆంక్షలు విధిస్తున్నారు. 1990లనాటికీ, ఇప్పటికీ తామేమీ మారలేదని నిరూపించుకుంటున్నారు.

Also read : North korea Missile : వరుస మిస్సైల్ ప్రయోగాలతో కవ్విస్తున్న కిమ్..ఆందోళనలో దక్షిణకొరియా
కాబూల్‌ను ఆక్రమించుకున్నప్పుడు తాలిబన్లు చెప్పిన మొదటి మాట ప్రజల అభిప్రాయాలను, అవసరాలను పరిగణనలోకి తీసుకుని పరిపాలన సాగిస్తామని. అలాగే మహిళలు స్వేచ్ఛగా సంచరించే అవకాశం కల్పిస్తామని, అమ్మాయిలు చదువుకోవచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చని, ఆంక్షల చట్రంలో బంధించబోమని ప్రపంచానికి హామీ ఇచ్చారు తాలిబన్లు. కానీ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తాలిబన్లు ఈ హామీలకు తూట్లు పొడిచారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా సేనలు అఫ్ఘాన్‌లో అడుగుపెట్టకముందు దేశం ఎలా ఉందో..మళ్లీ అలాంటి స్థితిలోకి తీసుకెళ్తున్నారు. మహిళల హక్కుల సంగతి పక్కనపెడితే….కనీస అవసరాలను సైతం గుర్తించడానికి నిరాకరిస్తున్నారు.

బుర్ఖా తప్పనిసరి..కళ్లు మాత్రమే కనిపించాలి..అలా కాకుండా ప్రవర్తిస్తే సదరు మహిళల కుటుంబంలో పురుషులకు శిక్షలు తప్పవని తాలిబన్లు హెచ్చరించారు.మహిళలు ఇల్లు దాటి బయటకు రావొద్దని ఆదేశించారు. ఇలా ఒకటీ రెండూ కాదు తాలిబన్ల అరాచకాలకు అంతులేకుండాపోతోంది. మహిళలకోసం తాలిబన్లు కొత్తగా జారీచేసిన డిక్రీ….వారి ఆలోచనలు ఎంత క్రూరంగా ఉన్నాయో తెలియజేస్తోంది. కళ్లు తప్ప..ముఖం, శరీరంలోని మరేభాగం కనిపించనీకుండా ఉండే బుర్ఖా ధరించి మాత్రమే మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావాలన్నది తాజా ఆదేశాల సారాంశం.

Also read : Russia Victory Day : రెండో ప్రపంచయుద్ధంలో నాజీలకు పట్టిన గతే యుక్రెయిన్ కు పడుతుంది : పుతిన్

మహిళలు అలా ముసుగులో కనిపించకపోతే..వారి కుటుంబంలోని పురుషులు శిక్ష అనుభవించాల్సివస్తుందని హెచ్చరించారు. అంతే కాదు…తప్పనిసరైతే తప్ప అసలు అమ్మాయిలు ఇల్లు దాటి బయట అడుగుపెట్టవద్దని ఆదేశించారు. ఈ ఆదేశాలు గమనిస్తే…ఇక అప్ఘాన్‌లో అమ్మాయిలు ఉన్నత చదవులు చదవడం, ఉద్యోగాలు చేయడం అసాధ్యమేనని స్పష్టమైపోతోంది. ఈ ఆంక్షలను తాలిబన్లు సమర్థించుకుంటున్నారు. అమ్మాయిల రక్షణకోసమే ఈ నిబంధనలు విధించామని చెబుతున్నారు.

తాలిబన్ల పాలనలో ఆహార సంక్షోభంతో అప్ఘానిస్తాన్ అల్లాడుతోంది. చిన్నారులకు పోషకాహారం అందడం లేదు. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి అప్ఘాన్ పరిస్థితులపై అనేకమార్లు ఆందోళన వ్యక్తంచేసింది. తాలిబన్లు తమ వైఖరి మార్చుకుంటే….సజావుగా పాలన సాగిస్తే….అనేక దేశాలు వారి ప్రభుత్వాన్ని గుర్తిస్తాయి. ఆర్థిక సాయం అందిస్తాయి. అప్పుడు ప్రజల పరిస్థితి మెరుగుపడుతుంది. తాలిబన్ నేతలు ఈ ప్రయత్నాలు చేయకుండా తమ నిరంకుశత్వంతో ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు