Russia Victory Day : రెండో ప్రపంచయుద్ధంలో నాజీలకు పట్టిన గతే యుక్రెయిన్ కు పడుతుంది : పుతిన్

రెండో ప్రపంచయుద్ధంలో నాజీలకు పట్టిన గతే యుక్రెయిన్ కు పడుతుంది..1945 రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీ సైన్యాన్ని సోవియట్‌ సైన్యం ఓడించినట్టే, ఉక్రెయిన్‌ను ఓడించాలని రష్యా సైనికులకు పిలుపునిచ్చారు రష్యా అధ్యక్షడు పుతిన్..

Russia Victory Day : రెండో ప్రపంచయుద్ధంలో నాజీలకు పట్టిన గతే యుక్రెయిన్ కు పడుతుంది : పుతిన్

World War Ii..russia Victory Day Celebrations

World War II..Russia Victory Day Celebrations : రష్యా రాజధాని మాస్కోలో సోమవారం విక్టరీ డే పరేడ్‌కు ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సాధించిన విఝయానికి గుర్తుగా రష్యా రాజధాని మాస్కోలో విక్టరీ డే సెలబ్రేషన్స్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో విక్టరీ డే సెలబ్రేషన్స్ పరేడ్ కు హాజరు కావటానికి ముందు పుతిన్ కీలక ప్రకటన చేశారు.

Also read : Ukraine – Russia: యుక్రెయిన్ లో అణ్వాయుధాలను మోహరించే ఉద్దేశం లేదు: రష్యా

1945 రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీ సైన్యాన్ని సోవియట్‌ సైన్యం ఓడించినట్టే, ఉక్రెయిన్‌ను ఓడించాలని రష్యా సైనికులకు పిలుపునిచ్చారు.‘‘అప్పుడు ప్రపంచ యుద్ధాన్ని గెలిచాం.ఇప్పుడు యుక్రెయిన్ ను గెలుస్తాం..వరల్డ్ వార్ తరహాలోనే యుక్రెయిన్ పై గెలుపు సాధిస్తాం’’ అంటూ అంటూ ధీమా వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ..ప్రపంచ వ్యాప్తంగా మరోసారి నాజీయిజం పగడ విప్పుతోంది అని దాన్ని పడగను అణగదొక్కి గెలుపు సాధిస్తాం అని అన్నారు. నాజీయిజాన్ని అంతం చేయటం రష్యా పౌరుల బాధ్యత అని అన్నారు పుతిన్ పుతిన్ ప్రసంగంపైనే ప్రపంచం దృష్టి అంతా కేంద్రీకరించింది.

రష్యా విక్టరీ డే సంబరాల వేళ ఉక్రెయిన్‌పై ముప్పేట దాడులు జరుతున్నాయి. తూర్పు యుక్రెయిన్‌ ప్రాంతం లోని లుహాన్‌స్క్‌లో స్కూల్‌పై రష్యా బాంబు దాడిలో 60 మంది చనిపోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బాంబు దాడి జరిగిన సమయంలో స్కూళ్లో 90 మందికి పైగా ఉన్నట్టు యుక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో అమాయక పౌరులు చనిపోయారని యుక్రెయిన్‌ సైన్యం ఆరోపించింది.

Also read :  Imran Khan: తనను తాను గాడిదతో పోల్చుకున్న ఇమ్రాన్.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న వీడియో..

రష్యా వైమానిక దాడుల తరువాత లుహాన్‌స్క్‌లోని బిలోహోరివ్కాలో స్కూల్‌ బిల్డింగ్‌కు మంటలు వ్యాపించడంతో అందులో ఆశ్రయం పొందుతున్న 60 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా సైన్యం స్వాధీనం చేసుకున్న మరియుపోల్‌లోని అజోవ్‌స్టాల్‌ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి వందలాది మందిని యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ICRC) అక్కడి నుంచి తరలించింది. సుమారు 300 మందిని అక్కడి నుంచి కాపాడినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా దాడితో ఉక్రెయిన్‌కు చెడు తిరిగి వచ్చిందన్నారు. అయితే తమ దేశం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా..యుక్రెయిన్ పై రష్యా యుద్ధం చేపట్టి 75 రోజులు గడిచింది.