Ukraine – Russia: యుక్రెయిన్ లో అణ్వాయుధాలను మోహరించే ఉద్దేశం లేదు: రష్యా

యుక్రెయిన్ పై వ్యూహాత్మక అణ్వాయుధాలను మోహరించే ఉద్దేశం రష్యాకు లేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి శుక్రవారం అన్నారు

Ukraine – Russia: యుక్రెయిన్ లో అణ్వాయుధాలను మోహరించే ఉద్దేశం లేదు: రష్యా

Russia

Ukraine – Russia: యుక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యా అణ్వాయుధాలు ఉపయోగించొచ్చన్న వార్తలు యుద్ధం మొదలైన నాటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. రష్యా సైనికాధికారులు, విదేశాంగ మంత్రి సైతం యుద్ధం తీవ్ర రూపం దాల్చితే యుక్రెయిన్ పై అణ్వస్త్రాలను ఉపయోగించేందుకు కూడా వెనుకాడబోమంటూ పలుమార్లు హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే యుక్రెయిన్ పై వ్యూహాత్మక అణ్వాయుధాలను మోహరించే ఉద్దేశం రష్యాకు లేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి శుక్రవారం అన్నారు. పాశ్చాత్యదేశాల అధికారులు రష్యాపై “నిరాధారమైన” ఆరోపణలు చేస్తున్నారంటూ అమెరికాలోని రష్యా దౌత్యాధికారి ఆయా దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒకరోజు అనంతరం రష్యా ఈ ప్రకటన చేయడం విశేషం.

Also read:Twitter Deal Row: ట్విట్టర్ డీల్ వెనుక ట్రంప్ ఉన్నాడా?: ఎలాన్ మస్క్ ఏమన్నారంటే!

“అణ్వస్త్ర యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరనే” సూత్రానికి రష్యా కట్టుబడి ఉందని, దానిని అతిక్రమించబోమని రష్యా సమాచార, పత్రికా విభాగం డిప్యూటీ డైరెక్టర్ అలెక్సీ జైట్సేవ్ అన్నారు. ఉక్రెయిన్ లో మాస్కో సైనిక లక్ష్యాలకు వర్తించే సంభావ్య దాడులకు సంబంధించి రష్యా అణు సిద్ధాంతం ఎటువంటి దృశ్యాలను ఊహించలేదని ఆయన అన్నారు. ఏదేమైనా, ఉక్రెయిన్ మరియు పశ్చిమ దేశాల నుండి “మీడియా పరంగానూ, లేదా ప్రత్యక్షంగానూ ఏవైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవచ్చని ” అని జైట్సేవ్ అన్నారు. రష్యా అణు విధానంపై అక్కడి అధికారులు చేసే ప్రకటనలను పాశ్చాత్యదేశాలు తప్పుగా చిత్రీకరించడంపై అమెరికాలోని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ ఖండించారు.

యుక్రెయిన్ రష్యా యుద్ధ నేపథ్యంలో అణు ఉద్రిక్తతలు పెరుగుతున్నందుకు రష్యాను తప్పుగా నిందించారని, అణ్వస్త్రాల వినియోగం పై పాశ్చాత్య దేశాల వాదనలు వాస్తవానికి బిన్నంగా ఉన్నాయని అనటోలీ ఆంటోనోవ్ చెప్పుకొచ్చారు. యుక్రెయిన్ లో పరిస్థితులు దిగజారడానికి కారణం పాశ్చాత్య కూటమి దేశాలేనని..నాటో కూటమి వ్యాఖ్యలు, యుక్రెయిన్ కు ఆయా దేశాల మద్దతు..అను అణు ఉద్రిక్తతలు పెరగడానికి దోహదం చేశాయని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ తెలిపారు. “ప్రస్తుత తరం నాటో రాజకీయ నాయకులు అణు ముప్పును తీవ్రంగా పరిగణించడం లేదు” అని అంటోనోవ్ అన్నారు.

Also read:Next Pandemic: వాతావరణ మార్పులతో జంతువులు వైరస్ వ్యాప్తి పెరిగేందుకు కారణమవుతున్నాయా?