Next Pandemic: వాతావరణ మార్పులతో జంతువులు వైరస్ వ్యాప్తి పెరిగేందుకు కారణమవుతున్నాయా?

కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం చైనా, దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాలు మినహా మిలిగిన దేశాల్లో కరోనా వ్యాప్తి తగ్గింది. భారతదేశంలో కొవిడ్ ఆంక్షలను...

Next Pandemic: వాతావరణ మార్పులతో జంతువులు వైరస్ వ్యాప్తి పెరిగేందుకు కారణమవుతున్నాయా?

New Project

Next Pandemic: కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం చైనా, దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాలు మినహా మిలిగిన దేశాల్లో కరోనా వ్యాప్తి తగ్గింది. భారతదేశంలో కొవిడ్ ఆంక్షలను ఎత్తివేశారు. కొవిడ్ వేరియంట్ల వారిగా రూపాంతరం చెందుతుంది. ఎప్పుడు ఏరూపంలో వైరస్ దాడిచేస్తుందో శాస్త్రవేత్తలకు అంతుచిక్కని పరిస్థితి. ఇదే విషయంపై ఇటీవల డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా వాతావరణ మార్పులు – వైరస్‌ల సంక్రమణపై జార్జ్‌టౌన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ద్వారా వారు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Corona Next Season: మరోసారి కరోనా వ్యాప్తి తప్పదు: ఇజ్రాయెల్ పరిశోధకులు

విపరీతంగా పెరుగుతోన్న ఉష్ణోగ్రతల వల్ల అడవి జంతువులు జనావాస ప్రాంతాల్లోకి తరలిరానుండటంతో వాటి ద్వారా వైరస్‌లు మానవులకు సోకడంతో మరో మహమ్మారి ముప్పును ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా గబ్బిలాల నుంచి మధ్యంతర జీవులకు, అక్కడ నుంచి ప్రజలకు వైరస్ సోకే పరిస్థితులకు దారితీస్తాయని జార్జ్ టౌన్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ కార్ల్‌సన్ పేర్కొన్నారు. ఎబోలా, కరోనా వంటి వైరస్‌లు కొత్త ప్రాంతాల్లో విస్తరించడానికి ఇవి అవకాశం కల్పించే ప్రమాదం ఉందన్నారు. దీంతో మూలాలను గుర్తించలేని విధంగా మారడంతో పాటు వన్యప్రాణుల నుంచి మానవుల్లోకి వైరస్ లు ప్రవేశించేందుకు వాతావరణ మార్పులు కారణమవుతాయని అధ్యయనం ద్వారా పేర్కొన్నారు.

Covid Deaths: భారత్‌లోనే కరోనా మరణాలు ఎక్కువన్న డబ్ల్యూ.హెచ్.ఓ: కొట్టిపారేసిన కేంద్రం

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వేడి వాతావరణం ఉన్న కారణంగా ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమై ఉండొచ్చని, భూతాపం తగ్గించడం వల్ల ఈ ప్రమాదాన్ని ఆపలేకపోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. గబ్బిలాలకు సుదూర ప్రాంతాలకు వెళ్లే సామర్థ్యం ఉన్నందు వల్ల వైరస్ వ్యాప్తి ఇతర జంతువులకు సోకే అవకాశం ఉందని, అటు నుంచి మానవులకు ఆ వైరస్ వ్యాప్తి జరిగే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అవి మానవుని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్నే చూపే అవకాశాలు ఉన్నాయని, అయితే తమ అధ్యయనాల ద్వారా వైరస్ వ్యాప్తిని ముందే పసిగట్టి నివారించే మార్గాలను అన్వేషిస్తున్నామని డాక్టర్‌ కొలిన్‌ కార్ల్‌సన్‌ తెలిపారు.