Corona Next Season: మరోసారి కరోనా వ్యాప్తి తప్పదు: ఇజ్రాయెల్ పరిశోధకులు

రాబోయే రెండు నెలల్లో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్లు కొన్ని అంతమై..డెల్టా లేదా వేరే కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తి ఉండవచ్చని ఇజ్రాయెల్ పరిశోధకులు నిర్వహించిన మోడలింగ్ అధ్యయనం తెలిపింది

Corona Next Season: మరోసారి కరోనా వ్యాప్తి తప్పదు: ఇజ్రాయెల్ పరిశోధకులు

Bgu

Corona Next Season: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా వ్యాప్తి మొదలు కానుందా?. 2020 నాటి లాక్ డౌన్ పరిస్థితులు తప్పవా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు ఇస్తున్నారు పరిశోధకులు. రాబోయే రెండు నెలల్లో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్లు కొన్ని అంతమై..డెల్టా లేదా వేరే కొత్తరకం కరోనా వైరస్ వ్యాప్తి ఉండవచ్చని ఇజ్రాయెల్ పరిశోధకులు నిర్వహించిన మోడలింగ్ అధ్యయనం తెలిపింది. ఈ పరిశోధనల తాలూకు విశ్లేషణలు ఏప్రిల్ చివరి వారం సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్లో ప్రచురితమైయ్యాయి. డెల్టా దాని ముందు ఉన్న వేరియంట్లన్ని అంతమైనప్పటికీ, ఒమిక్రాన్ మాత్రం ప్రాణాంతక వేరియంట్ ను తొలగించలేదని దాని కారణంగా వైరస్ తిరిగి ఉద్భవించగలదని పరిశోధకులు పేర్కొన్నారు.

Also read:Elon Musk : ఎలాన్ మస్క్‌కు ఫీలింగ్స్ ఉన్నాయి.. ఇదిగో ఆయన కన్నీళ్లే సాక్ష్యం..!

ఇజ్రాయెల్‌లోని బెన్-గురియన్ యూనివర్శిటీ ఆఫ్ నెగెవ్ (BGU) పరిశోధకులు మురుగునీటిలో కరోనా వైరస్ ల మధ్య తేడాలు గుర్తించేందుకు సున్నితమైన శ్రేణులను అభివృద్ధి చేశారు. మురుగు నీటిలో కరోనా వైరస్ ఎక్కడ ఉందో గుర్తించగలిగిన, అది మనుషుల్లో RT PCR మరియు ఇతర నిర్ధరణ పరీక్షలకు చిక్కకుండా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. డిసెంబర్ 2021 నుండి జనవరి 2022 వరకు ఇజ్రాయెల్లోని బీర్-షెవా నగరంలో మురుగునీటిపై జరిపిన పరిశోధనల్లో ఒమిక్రాన్ మరియు డెల్టా వేరియంట్ల మధ్య ఆందోళనకర స్థాయిలో “పరస్పర చర్య” జరిగినట్లు గమనించారు.

Also Read:Police Humanity: అర్ధరాత్రి సైకిల్‌పై డెలివరీ బాయ్‌ని చూసి పోలీసులు ఏం చేశారో తెలుసా!

ఈసమయంలో డెల్టా వేరియంట్ దాని లక్షణ సమయాన్ని అంతకంతకు పెంచుకుంటుండగా..ఒమిక్రాన్ వేరియంట్ మాత్రం తనను తాను అంతం చేసుకునే నమూనాను కూడా పరిశోధకులు గుర్తించారు. “కరోనా వైరస్ వ్యాప్తి పై చాలా కారకాలు ఆధారపడి ఉన్నప్పటికీ, ఈ వేసవిలో డెల్టా లేదా మరొక కరోనావైరస్ వేరియంట్ యొక్క వ్యాప్తి ఉండవచ్చని మా నమూనా సూచిస్తుంది” అని బిజియు ప్రొఫెసర్ ఏరియల్ కుష్మారో ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిలో ఉండగా రికార్డు స్థాయిలో ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నారు.

Also Read:US Supreme Court : గర్భస్రావ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు..!