Elon Musk : ఎలాన్ మస్క్‌కు ఫీలింగ్స్ ఉన్నాయి.. ఇదిగో ఆయన కన్నీళ్లే సాక్ష్యం..!

Elon Musk : టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విట్టర్ టేకోవర్ చేసిన బిలియనీర్.. ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.. ఎలాన్ మస్క్ అనగానే ఆయనో ఫన్నీ మ్యాన్‌గా భావిస్తుంటారు.

Elon Musk : ఎలాన్ మస్క్‌కు ఫీలింగ్స్ ఉన్నాయి.. ఇదిగో ఆయన కన్నీళ్లే సాక్ష్యం..!

Elon Musk Says Negative Comments Affect Him 'i'm Not An Android'

Elon Musk : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk).. ట్విట్టర్ టేకోవర్ చేసిన బిలియనీర్.. ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.. ఎలాన్ మస్క్ అనగానే ఆయనో ఫన్నీ మ్యాన్‌గా కొందరు భావిస్తుంటారు. మరికొందరు ఆయనో మేధావిగా భావిస్తుంటారు. యువతకు మాత్రం మస్క్ ఒక ఫేవరెట్ ఐకాన్‌గా చెప్పవచ్చు. అలాంటి మస్క్.. ఎప్పుడు ఏదో ఫన్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉల్లాహాసంగా కనిపించే బిలియనీర్ ఎలాన్ మస్క్ ఒక్కసారిగా కంటితడి పెట్టుకున్నారు. ఫుల్‌గా ఎమోషనల్ అయిపోయారు.

నిత్యం సరదగా కనిపించే మస్క్ నవ్వు వెనుక ఇంత బాధ దాగి ఉందా అనిపించకమానదు.. ఇంతకీ మస్క్ అంతగా బాధపడిపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయట.. అందులో ఒకటి ఆయనపై విపరీతమైన నెగటివిటీ రావడమే.. తనపై ఎంతగా వ్యతిరేకత వచ్చినా ఎలా నవ్వుతూ ఉండగలరంటే.. అవన్నీ ఆయనేం పట్టించుకోరు.. ఎవరేమీ అనుకున్నా.. తాను చేసేది తాను చేసుకుంటూ పోవడం మస్క్ నైజం. ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంతమాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా ముందుకు సాగిపోతుంటారు. అందుకే ప్రపంచంలో బిలియనీర్ స్థాయికి ఎదిగారన్నది కాదనలేని సత్యం..

Elon Musk Says Negative Comments Affect Him 'i'm Not An Android' (1)

Elon Musk Says Negative Comments Affect Him ‘i’m Not An Android’

ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన Met Gala వార్షికోత్సవానికి తన తల్లిని తీసుకుని వచ్చారు ఎలాన్ మస్క్.. తనపై వచ్చే విమర్శలను విని తట్టుకోగలిగేంత హృదయం తనకు లేదన్నాడు. తనకు అందరిలానే ఫీలింగ్స్ ఉంటాయని ఎమోషనల్ అయ్యారు. తానేమీ ఆండ్రాయిడ్ రోబోను కాదన్నారు. అందరిలా తాను కూడా మనిషినేని, బాధ ఎవరికైనా బాధేనేని మస్క్ చెప్పుకొచ్చారు.

సోషల్ మైక్రో వెబ్‌సైట్ ట్విట్టర్ టేకోవర్ చేసుకున్నాక మొదటిసారి మస్క్ జనం మధ్యలోకి వచ్చారు. మీడియా, ఇంటర్నెట్‌లో తనపై వ్యతిరేకత విపరీతంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు తనకు చాలా బాధగా అనిపిస్తుంటుందని చెప్పాడు. అయినప్పటికీ వాటిని తేలికగా తీసుకునే ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చాడు. ఆన్‌లైన్‌‌లో తనపై జరిగే ట్రోల్స్‌ విషయంలో ఎక్కువగా బాధించినట్టు మస్క్ చెప్పారు.

Read Also : Elon Musk: ట్వీట్లు ఊరికే రావ్.. కొందరు యూజర్లు డబ్బులివ్వాల్సిందే అంటోన్న ఎలన్ మస్క్