Police Humanity: అర్ధరాత్రి సైకిల్‌పై డెలివరీ బాయ్‌ని చూసి పోలీసులు ఏం చేశారో తెలుసా!

ఇంతలోనే డెలివరీ బాయ్ వద్దకు వచ్చిన పోలీస్ అధికారి 'అర్ధరాత్రి ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావ్..బైక్ మీద డెలివరీ ఇవ్వొచ్చగా'అని అడిగాడు

Police Humanity: అర్ధరాత్రి సైకిల్‌పై డెలివరీ బాయ్‌ని చూసి పోలీసులు ఏం చేశారో తెలుసా!

Delivery

Police Humanity: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం..అర్ధరాత్రి సమయంలో సైకిల్ పై పార్సెల్ డెలివరీ చేసేందుకు వెళ్తున్నాడు జొమాటో డెలివరీ బాయ్. అదే సమయంలో పాట్రోలింగ్ కోసం అటుగా వచ్చిన పోలీసులు కొద్దిసేపు డెలివరీ బాయ్ వెనుకనే ఫాలో అయ్యారు. పోలీసులను చూసి డెలివరీ బాయ్ భయంతో ఆగిపోయాడు. ఇంతలోనే డెలివరీ బాయ్ వద్దకు వచ్చిన పోలీస్ అధికారి ‘అర్ధరాత్రి ఎందుకు ఇంతలా కష్టపడుతున్నావ్..బైక్ మీద డెలివరీ ఇవ్వొచ్చగా’అని అడిగాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న ఆ డెలివరీ బాయ్..తన కుటుంబ పరిస్థితి, ఆర్ధిక సమస్యల గురించి చెప్పి బైక్ కొనుక్కునే స్తోమత లేదని వివరించాడు.

Also read:Stock Markets : ఆర్బీఐ నిర్ణయంతో భారీగా స్టాక్ మార్కెట్లు పతనం

డెలివరీ బాయ్ కష్టాలకు చలించిన పోలీసు అధికారి అప్పటికపుడే అతన్ని స్టేషన్ కు తీసుకువెళ్లి..సిబ్బంది నుంచి కాస్త డబ్బులు పోగేసి తరువాత రోజు ఉదయాన్నే ఆ డెలివరీ బాయ్‌కి కొత్త బైక్ కొనిచ్చాడు. ఇండోర్ విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెహజీబ్ క్వాజి మానవత్వంతో స్పందించిన తీరు.. ఆ డెలివరీ బాయ్ జీవితాన్ని మరింత ముందుకు నడిచేలా చేసింది. పోలీసు అధికారి నుంచి ఊహించని రీతిలో బహుమతి అందుకున్న ఆ డెలివరీ బాయ్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

Also Read:heroin drug: కడుపులో రూ.11 కోట్ల విలువైన డ్రగ్స్.. ఎయిర్‌పోర్టులో పట్టివేత

పోలీస్ అధికారి తెహజీబ్ క్వాజి ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ..డెలివరీ బాయ్ పట్ల మానవతా దృక్పధంతో స్పందించి రూ.32,000 పోగేసి బైక్ కొనిచ్చామని, జీవితంలో కష్టపడేవారికి సహాయం చేస్తే వారు మరింత ఎదుగుతారని అన్నారు. డెలివరీ బాయ్ మాట్లాడుతూ..సైకిల్ ఉన్నపుడు రోజుకి 6-8 పార్సెల్స్ డెలివరీ చేసేవాడినని, బైక్‌తో ఇప్పుడు 15-20 డెలివరీలు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక ఈ వార్త బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విజయ్ నగర్ పోలీసుల తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:Sonu Nigam : లాంగ్వేజ్ వార్.. మన భాషని ఇతరులపై రుద్దకూడదు.. స్టార్ సింగర్ వ్యాఖ్యలు..