Sonu Nigam : లాంగ్వేజ్ వార్.. మన భాషని ఇతరులపై రుద్దకూడదు.. స్టార్ సింగర్ వ్యాఖ్యలు..

బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూనిగమ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాషా వివాదంపై మాట్లాడుతూ.. ''నాకున్న జ్ఞానం ప్రకారం భారత రాజ్యాంగంలో హిందీ జాతీయ భాషగా..........

Sonu Nigam :  లాంగ్వేజ్ వార్.. మన భాషని ఇతరులపై రుద్దకూడదు.. స్టార్ సింగర్ వ్యాఖ్యలు..

Sonu Nigam

Sonu Nigam :  కన్నడ స్టార్ హీరో సుదీప్ హిందీ జాతీయభాష కాదు అని ఓ ఈవెంట్ లో మాట్లాడిన దగ్గర నుంచి ఈ లాంగ్వేజ్ వార్ మొదలైంది. సుదీప్ కి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కౌంటర్ ఇవ్వగా దేశమంతటా ఈ లాంగ్వేజ్ వార్ పాకింది. ఇక దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ లాంగ్వేజ్ వార్ లో దూరి వారికి తగ్గట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది సుదీప్ కి సపోర్ట్ ఇస్తూ, కొంతమంది అజయ్ దేవగణ్ కి సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు. ఈ భాషా వివాదంపై ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు స్పందించగా తాజాగా బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూనిగమ్ దీనిపై మాట్లాడాడు.

SV Krishnareddy : ఎస్వీ కృష్ణారెడ్డి కారుకు చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూనిగమ్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాషా వివాదంపై మాట్లాడుతూ.. ”నాకున్న జ్ఞానం ప్రకారం భారత రాజ్యాంగంలో హిందీ జాతీయ భాషగా ఎక్కడా చెప్పలేదు. దేశంలో అత్యధికమంది మాట్లాడే భాష హిందీ అని మాత్రం తెలుసు. కానీ అత్యంత పురాతనమైన భాష తమిళం అని చెబుతూ ఉంటారు. ఇప్పటికే మన దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొత్తగా సమస్యలు కావాలా? నువ్వు తమిళుడివి అయినా సరే నువ్వు హిందీ మాట్లాడాలి అంటూ ఇతరులపై మన భాషను రుద్దకూడదు. ప్రజ‌ల‌కు వారు మాట్లాడాలనుకుంటున్న భాషను నిర్ణయించుకునే హక్కు ఉండాలి” అని తెలిపాడు. దీంతో హిందీ వాడైనా సోనూనిగమ్ హిందీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఈయన చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అవుతున్నాయి.