SV Krishnareddy : ఎస్వీ కృష్ణారెడ్డి కారుకు చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

సుల్తాన్ బజార్ పోలీసులు మంగళవారం బ్యాంక్ స్ట్రీట్ లో కార్లని తనిఖీ చేస్తుండగా ఓ కారుకు నంబర్ ప్లేట్ సరిగ్గా లేదని గుర్తించారు. దీంతో ఆ కారుని ఆపగా అందులోంచి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి............

SV Krishnareddy : ఎస్వీ కృష్ణారెడ్డి కారుకు చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

Sv Krishna Reddy

SV Krishnareddy :  ఇటీవల గత కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు చెక్ పోస్టులు పెట్టి మరీ కార్లని తనిఖీ చేస్తున్నారు. బ్లాక్ ఫిలింస్ ఉన్నాయని గత కొన్ని రోజులుగా చాలా మంది సెలబ్రిటీల కార్లకి చలానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కారుకి కూడా చలానా విధించారు. అయితే ఇది బ్లాక్ ఫిలింకి సంబంధించిన చలానా కాదు.

Jai Bheem : దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌లో నాంది, జై భీమ్ సినిమాలకి అవార్డులు..

సుల్తాన్ బజార్ పోలీసులు మంగళవారం బ్యాంక్ స్ట్రీట్ లో కార్లని తనిఖీ చేస్తుండగా ఓ కారుకు నంబర్ ప్లేట్ సరిగ్గా లేదని గుర్తించారు. దీంతో ఆ కారుని ఆపగా అందులోంచి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దిగారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేని కారణంగా చలానా విధిస్తున్నామని తెలిపి ఎస్వీకృష్ణారెడ్డి బీఎండబ్ల్యూ కారుకి ఫైన్ వేశారు. ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణారెడ్డి వారితో మాట్లాడుతూ.. కారు నెంబర్‌ ప్లేట్‌ సరిచేసుకుంటానని, మండుటెండల్లో కూడా సక్రమంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసుల అంకితభావం అభినందనీయమని అన్నారు.