Afghanistan : తాలిబాన్ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న అఫ్ఘాన్ పోరాట యోధులు

తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినా అప్ఘానిస్తాన్ కోసం పోరాటం ఇంకా ముగియలేదు. అప్ఘాన్ తిరుగుబాటు దారులు తాలిబన్ల నుంచి తమ భూభాగాన్ని తిరిగి దక్కించుకున్నారు.

fight for Afghanistan : తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినా అప్ఘానిస్తాన్ కోసం పోరాటం ఇంకా ముగియలేదు. అప్ఘాన్ ప్రజాతిరుగుబాటు దారులు తాలిబన్ల నుంచి తమ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న స్థానిక పోరాట యోధులు తమ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారని అప్ఘాన్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. తాలిబన్లల నియంత్రణలో ఉన్న జిల్లాల కోసం 300 మంది ముజాహిదీన్ సభ్యులు ముష్కరులతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఉత్తర కూటమికి సంబంధించిన కమాండర్లు-ఈశాన్య బాగ్లాన్ ప్రావిన్స్‌లోని మూడు జిల్లాలలో తాలిబాన్ నియంత్రణపై ప్రతిఘటించారు.

ఈ ఘర్షణలో 36 తాలిబాన్ ఫైటర్లతో పాటు డజన్ల కొద్దీ గాయపడ్డారు. తాలిబన్లు ఆక్రమించిన తమ భూభాగం కోసం స్థానిక పోరాట యోధులు సొంత ఆయుధాలతో ప్రజా తిరుగుబాటు దళాలుగా దండెత్తారు. ప్రావిన్స్‌లోని బాను, పోల్-ఎ-హేసర్ డి సాలా జిల్లాలను తాలిబన్ల చెరనుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్లు పాతిన జెండాలను స్థానికులు తొలగిస్తున్నారు. ఇప్పుడా ఈ పోరాటం ఉత్తర సలాంగ్‌లోని ఖెంజాన్ వైపుగా కొనసాగుతోందని మాజీ అధికారి తెలిపారు.

గత వారమే అఫ్ఘానిస్తాన్ ప్రావిన్షియల్ రాజధానుల్లో చాలావరకు పెద్ద నగరాలను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోరాట యోధులు తాలిబన్ల దాడిని తిప్పికొట్టేందుకు భారీ ఆయుధాలు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దాంతో సొంత ఆయుధాలతోనే తాలిబన్లపై ప్రతిఘటించి తమ భూభూగాలను తిరిగి దక్కించుకున్నారు. అమెరికన్లు, యూరోపియన్లు, సాధారణ ఆఫ్ఘన్‌లు తరలింపుకు విమానాల కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాబూల్ వెలుపల హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో రోజురోజుకు గంటకు గంటలలో భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. తాలిబన్ల ఆధిపత్యంలో తమ భూభాగాలను రక్షించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులోభాగంగానే బాగ్లాన్ ప్రావిన్స్‌లో, పంష్‌జీర్ ప్రావిన్స్ సీనియర్ కమాండ్ స్పెషల్ దళాలతో తాలిబన్లతో ప్రతిఘటనకు దిగారు. తమ భూభాగాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.
Mohammad Abbas: భారత మిలిట్రీఅకాడ‌మీలో ట్రైనింగ్ పొందిన అఫ్ఘన్‌ తాలిబన్‌ అగ్రనేత

ట్రెండింగ్ వార్తలు