Mohammad Abbas: భారత మిలిట్రీఅకాడ‌మీలో ట్రైనింగ్ పొందిన అఫ్ఘన్‌ తాలిబన్‌ అగ్రనేత

తాలిబ‌న ఉగ్ర సంస్థ‌ను నడిపిస్తున్న ఏడుగురు నేతల్లో కీలక అగ్రనేత షేర్ మొహ‌మ్మ‌ద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ ఒకప్పుడు భారత్ మిలటరీలోనే ట్రైనింగ్ అయ్యాడు.

Mohammad Abbas: భారత మిలిట్రీఅకాడ‌మీలో ట్రైనింగ్ పొందిన అఫ్ఘన్‌ తాలిబన్‌ అగ్రనేత

Top Afghan Taliban Leader Mohammad Abbas (1)

Top Afghan Taliban leader Mohammad Abbas: ప్ర‌స్తుతం తాలిబ‌న ఉగ్ర సంస్థ‌ను ఏడుగురు నేతలు నడిపిస్తున్నారు. వీరి చెప్పిందే వేదం..చేసిందే చట్టం అన్నట్లుగా ఉంటుంది. పక్కా వ్యూహాలు పన్నటంలో వీరు దిట్ట. అటువంటి తాలిబన్ల ఏడుగురు నాయకుల్లో ఓ అగ్రనేత ఒకప్పుడు మన భారతదేశం మిలటరీ అకాడమీలోనే ట్రైనింగ్ తీసుకున్నారనే విషయం తెలుసా? అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్ల అగ్ర‌నేత‌గా కొనసాగుతున్న ‘‘షేర్ మొహ‌మ్మ‌ద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్’’ ఒకప్పుడు భారత్ లోని డెహ్రాడూన్‌లోని ఇండియ‌న్ మిలిట‌రీ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందాడనే విషయం చాలామందికి తెలియదు.ప్రస్తుతం అఫ్గాన్ తాలిబన్ల హస్తగతం కావటంతో ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. ట్రైనింగ్ సమయంలో అతని బ్యాచ్ మేట్ గా ఉన్న ఓ వ్యక్తి ఈ విషయాన్ని తెలపటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది నేటి అఫ్గాన్ పరిస్థితుల రీత్యా.

అబ్బాస్ స్టానిక్‌జాయ్ ను ‘షెరూ’ అని పిలిచేవారని అతని బ్యాచ్ మేట్ తెలిపారు. తాలిబ‌న్ల అగ్ర‌నేత‌గా ఉన్న షేర్ మొహ‌మ్మ‌ద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ 1982లో ఆఫ్ఘ‌న్ సైన్యం త‌ర‌పున డెహ్రాడూన్‌లోని ఇండియ‌న్ మిలిట‌రీ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందాడు. అప్పుడు అత‌ని బ్యాచ్‌మేట్స్ అబ్బాస్‌ను షేరూ అని పిలిచేవారట. ప్ర‌స్తుతం తాలిబ‌న ఉగ్ర సంస్థ‌ను న‌డిపిస్తున్న ఏడుగురిలో షేరూ చాలా కీలక వ్యక్తి. భారత్ లో మిలటరీ ట్రైనింగ్ పొందిన అబ్బాస్ గురించి అత‌ని బ్యాచ్‌మేట్స్ పలు ఆసక్తిక‌ర విష‌యాలు వెల్లడించారు.

అబ్బాస్ బ్యాచ్ మేట్స్ అతని గురించి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘స్టానిక్‌జాయ్ 20 ఏళ్ల వ‌య‌సులో మన దేశానికి మిలటరీ ట్రైనింగ్ కోసం వచ్చాడు. ఫిజికల్ గా చాలా చాలా ఫిట్ గా ఉండేవాడు. అప్పట్లో అబ్బాస్ కు మ‌త‌ప‌ర‌మైన భావాలు పెద్దగా ఉండేవి కావు. విప్లవాత్మక భావాలేమి ఉండేవి కావు.అకాడ‌మీలో అందరూ అతడిని షెరూ అని పిలిచేవాళ్లం. షెరూ మీసాల‌తో అందరినీ అట్రాక్ట్ చేసేవాడు. షెరూ ఓ సాధారణ ఆఫ్ఘ‌న్ క్యాడెట్ అని ఆనాటి బ్యాచ్‌మేటి మేజ‌ర్ జ‌న‌ర‌ల్ ఏడీ చ‌తుర్వేది తెలిపారు. షేరూతో బ్యాచ్‌మేట్‌గా ఉన్న క‌ల్న‌ల్ కీస‌ర్ సింగ్ షెకావ‌త్ కూడా ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటూ..డెహ్రాడూన్‌లో ప్రతీ వీక్ ఎండ్ లో న‌ది ప్రాంతానికి ట్రిప్‌కు వెళ్లేవాళ్ల‌ం. అబ్బాస్‌తో క‌లిసి రిషికేశ్‌కు వెళ్లి గంగా న‌దిలో స్నానం చేసామని అలనాటి సంగతుల్ని కల్నల్ కీసర్ సింగ్ గుర్తు చేసుకున్నారు. కాగా అబ్బాస్ తో పాటు అఫ్గాన్ నుంచి 45 మంది విదేశీయులు ఇండియ‌న్ మిలిట‌రీ అకాడ‌మీలో ట్రైనింగ్ తీసుకున్న‌ారు.

కాగా అబ్బాస్ స్టానిక్‌జాయ్ లోగర్ ప్రావిన్స్‌లోని బరాకి బరాక్ జిల్లాలో 1963 లో జన్మించాడు. ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా చేరడానికి ముందు ఏడాదిన్నర పాటు IMA లో తన ప్రీ-కమిషన్ శిక్షణను పూర్తి చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్ చేత ఆక్రమించబడిన తర్వాత ఇది జరిగింది.1980 లలో అబ్బాస్ అఫ్ఘాన్ సైన్యాన్ని విడిచిపెట్టి, సోవియట్ సైన్యానికి వ్యతిరేకంగా ‘జిహాద్’ లో చేరాడు. ఆ తరువాత అతను 1996 నాటికి సైన్యాన్ని విడిచిపెట్టి..తాలిబాన్‌లో చేరాడు. అతను మిలిటెంట్ సంస్థకు అమెరికా దౌత్యపరమైన గుర్తింపు ఇచ్చేలా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ పరిపాలనతో చర్చలు జరిపాడు.

తరువాతి అబ్బాస్ తాలిబాన్ కీలక నేతగా ఎదిగాడు. పక్కా వ్యూహాలు రచించటంలో అబ్బాస్ దిట్ట అనే పేరుంది.దోహాలో తాలిబాన్ తన రాజకీయ కార్యాలయాన్ని స్థాపించినప్పుడు దానిని నిర్వాహణ వంటి పనలు అంశాల్లోను..తాలిబాన్ల తరపున చర్చలకు నాయకత్వం వహించటంలో అత్యంత కీలకంగా వ్వయహరించాడు. అబ్బాస్ చక్కటి ఇంగ్లీష్ మాట్లాడేవాడు. దీంతో తాలిబాన్లకు కీలక నేతగా మారాడు.అలా అఫ్గాన్ యుద్ధ వీరుడు కరడు కట్టిన తాలిబన్ ఉగ్రవాదిగా మారిపోయాడు.