Afghanistan Earthquake: అఫ్ఘానిస్థాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. మంగళవారం ఆ దేశ ఆగ్నేయ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. తూర్పు అఫ్ఘానిస్థాన్‌లో 6.0 తీవ్రతతో వచ్చిన భూకంపంతో ఇప్పటికే 1,400 మంది మృతి చెందగా, 3,000 మందికి పైగా గాయపడ్డారు.
ఈ విషాదాన్ని మరవక ముందే ఇవాళ మరో భూకంపం సంభవించడం గమనార్హం. అఫ్ఘానిస్థాన్‌లో భూకంపంపై అంతర్జాతీయ సమాజం సరిగ్గా స్పందించడం లేదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ అధికారి అన్నారు.
అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని అఫ్ఘానిస్థాన్ వ్యవహారాల యునైటెడ్ నేషన్స్ ప్రతినిధి ఇంద్రిక రత్వట్టే అన్నారు. అనేక సంక్షోభాలు, సమస్యలు ఎదుర్కొంటున్న అఫ్ఘానిస్థాన్ ప్రజల పట్ల సమాజ స్పందన సరిగ్గా లేదని చెప్పారు.
తూర్పు అఫ్ఘానిస్థాన్‌లో సంభవించిన భూకంపం వల్ల మరణాల సంఖ్య 1,400 చేరిందని, 3,000 మందికి పైగా గాయపడ్డారని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ సోషల్ ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తెలిపారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో, పర్వత ప్రాంతం, దూర ప్రాంతానికి చేరుకోవడానికి రక్షక బృందాలు ఎంతో శ్రమిస్తున్నాయని చెప్పారు.