Taliban Govt : వందలాది స్వచ్ఛంద సంస్థల లైసెన్సులు రద్దు చేసిన తాలిబన్లు..

అప్ఘానిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.దేశంలోని స్వచ్ఛంద సంస్థల లైసెన్సులు రద్దు చేసింది.

taliban Govt cancels aid organisations licenses

Afghanistan taliban Govt : అఫ్ఘానిస్థాన్ (afghanistan) ను స్వాధీనం చేసుకుని పాలనా పగ్గాలు చేపట్టినప్పటినుంచి తాలిబన్లు (Taliban)తీసుకునే నిర్ణయాలు వివాదాదస్పందంగా మారుతున్నాయి. ప్రజలపై అంతులేని ఆంక్షలతో అణచివేస్తు చదవుకునే హక్కును ఆఖరికి జీవించే హక్కును కూడా కాలరాస్తోంది తాలిబన్ ప్రభుత్వం. ఆడబిడ్డల చదువులపైనా..వారు చేసే ఉద్యోగాలు,ఉపాధిపైన ఆంక్షల ఉక్కుపాదం మోపే తాలిబన్లు మరో నిర్ణయం తీసుకున్నారు.

Viral Video: పసిబిడ్డ నుంచి 20 ఏళ్ల వరకు వారానికో ఫొటో.. ముద్దుల కూతురు ఎలా మారిందోనంటూ మురిసిపోయిన తండ్రి

అఫ్ఘాన్ లో పనిచేస్తున్న 216 స్వచ్ఛంద సంస్థల లైసెన్సులను రద్దు చేశారు. ఏడాదిలో 2016 సంస్థల లైసెన్సులు రద్దు చేశారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ డిప్యూటీ మినిస్టర్ (
Afhanistan Economy Deputy Minister )అబ్దుల్ లతీఫ్ నజారీ (Afhanistan Abdul latif Nazari)తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు తాలిబన్ల గైడ్ లైన్స్ పాటించడం లేదన్నారు తాలిబన్ ప్రభుత్వం నియమించిన లతీఫ్. అందుకే 216 సంస్థల లైసెన్స్ (aid organisations)రద్దు చేశామని తెలిపారు. ఈ రద్దు నిర్ణయం శాశ్వతం కాదని చెబతునే తాలిబన్ ప్రభుత్వం గైడ్ లైన్స్ పాటిస్తే వాటి లైసెన్స్ లను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

ఈ నిర్ణయాన్ని అఫ్ఘాన్ పౌరులు తీవ్రంగా ఖండిస్తున్నారు. స్వచ్ఛంధ సంస్థలు అనేక మందికి చేయూతను అందించాయని వాటిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాగా తాలిబన్లు రద్దు చేసిన 216 సంస్థల్లో నాలుగు విదేశీ సంస్థలు ఉన్నాయి.