Afghanistan Taliban : కొరడాతో అఫ్ఘాన్ మహిళలపై తాలిబన్ అధికారి దాడి..

విద్యాహక్కు కోసం నిరసనలు తెలిపే యువతులపై తాలిబన్అధికారులు రెచ్చిపోయారు. కొరడాతో అఫ్ఘాన్ మహిళలపై తాలిబన్ అధికారి దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది.

Afghanistan Taliban :అఫ్ఘానిస్థాన్ లో మహిళలపై తాలిబన్ ప్రభుత్వ అధికారుల దమనకాండ కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని కూల్చి అధికారాన్ని దక్కిచుకున్న తాలిబన్లు బాలికలు..మహిళలపై అంతులేని ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా బాలికలు, యువతులు చదువుకోవటానికి వీల్లేకుండా విద్యాహక్కు చట్టాలన్ని కాలరాస్తున్నారు. తాము చదువుకుంటామంటూ పోరాడే యువతులపై దాడు చేస్తున్నారు తాలిబన్ అధికారులు. తాజాగా అటువంటిదే జరిగింది. ఈశాన్య అఫ్ఘానిస్థాన్‌లోవిద్యాహక్కు కోసం నిరసన చేసే ఆఫ్ఘనిస్థాన్‌ మహిళలను తాలిబన్‌ అధికారి కొరడాతో కొట్టాడు.

గత వారం బురఖా ధరించనందుకు కొందరు విద్యార్థినులను బదక్షన్ విశ్వవిద్యాలయంలోకి అనుమతించలేదు. దీంతో తమ విద్యా హక్కు కోసం డిమాండ్‌ చేసిన యువతులు ఆ యూనివర్సిటీ గేట్‌ వద్ద నిరసనకు దిగారు. తమను లోపలకు రావటానికి అనుమతించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న తాలిబన్‌ అధికారి నిరసన చేస్తున్న యువతులను కొరడాతో కొట్టాడు. దీంతో వారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

అఫ్ఘానిస్థాన్‌ నుంచి అమెరికా సైన్యం వైదొలగుతున్న తరుణంలో తాలిబన్లు రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకోవటం..ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిణామాలతో అప్ఘానిస్థాన్ లో పెను పరిణామాలు జరిగాయి. ఎంతోమంది దేశ వదిలిపోయారు. ముఖ్యంగా తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తూ కనీసం చదువుకోవటానికి కూడా లేకుండా అంతులేని ఆంక్షల్ని కొనసాగిస్తున్నారు. యువతులు ఎవరైనా వారి ముఖం కనిపించేలా దుస్తులు ధరిస్తే కఠిన శిక్షలు విధిస్తున్నారు. చదువు, ఉద్యోగం హక్కులను హరించారు. దీంతో తమ హక్కుల కోసం ఆఫ్ఘన్‌ మహిళలు గళమెత్తుతున్నారు. తాలిబన్ అధికారులు మాత్రం ఏమాత్రం దయా జాలి కరుణ అనే మాటలకుక అర్థం కూడా తెలియన రాక్షస పాలన కొనసాగిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు