Burkina Faso
Africa : ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో నరమేధానికి తెగబడ్డారు జీహాదీలు. మిలటరీ యూనిఫాంలో వచ్చిన దుండగులు 60 మంది పౌరులను కాల్చి చంపారు. యటెంగా ప్రావిన్స్ లోని బర్గా ప్రాంతంలో అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధమున్న కొంత మంది జిహాదీలు దేశంలోకి అక్రమంగా చొరబడి 60మందిని హతమార్చారు. ఈ దారుణంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడి ప్రాణాలతో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఈ దారుణం జరుగగా ఆదివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధమున్న కొంత మంది జిహాదీలు..పాల్పలడే దారుణాలకు ఇప్పటి వరకు వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారని దాదాపు 20 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారని తెలిపారు. ఒకప్పుడు శాంతియుతంగా ఉన్న దేశంలో అల్లకల్లోలం సృష్టించి.. విభజించారు. దీంతో గత ఏడాది రెండు సార్లు ఘర్షణలు చెలరేగాయని తెలిపారు.జీహాదీలు బుర్కినా ఫోసోలో ఏడేళ్లుగా ఇటువంటి హింసలకు పాల్పడుతున్నారని వేలాదిమందిని చంపారని దాదాపు 20లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయేలా చేశారని తెలిపారు.
రెండవ తిరుగుబాటు సమయంలో కెప్టెన్న ఇబ్రహీం ట్రార్ సెప్టెంబర్ లో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ప్రజల హక్కులకు భంగం కలుగుతోంది. దారుణ హత్యలకు పౌరులు బలైపోతున్నారు. బుర్కినా ఫాసో ప్రభుత్వం ఇటీవల తన భద్రతా దళాల మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై ఇతర దర్యాప్తులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.