baby girl : 138 సంవత్సరాల తర్వాత ఆ ఫ్యామిలీలో ఆడపిల్ల .. ఆసక్తి కలిగిస్తున్న స్టోరి

ఓ కుటుంబంలో తరతరాలుగా అబ్బాయిలే పుట్టారు. ఆడపిల్ల కోసం ఎంతగా ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. చివరికి 138 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల పుట్టింది. ఇక ఆ కుటుంబం సంతోషానికి అవధుల్లేవు.

baby girl : ఓ కుటుంబంలో తరతరాలుగా అందరూ అబ్బాయిలే పుట్టారు. ఆడపిల్ల పుడితే బాగుండును అని ఎదురుచూసినా కలగలేదు. 138 సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో మొదటిసారి ఆడపిల్ల పుట్టింది. ఎంతో సంతోషంగా ఆ శిశువుకు స్వాగతం చెప్పిన ఆ కుటుంబం కథా, కమామీషు చదవండి.

Malegaon Court: వింతైన తీర్పు ఇచ్చిన మాలేగావ్ కోర్టు.. ముద్దాయి రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలట

యూఎస్‌ (US) మిచిగాన్‌కి (Michigan) చెందిన కరోలిన్ (Carolyn), ఆండ్రూ క్లార్క్‌ల(Andrew Clark) స్టోరీ చాలా ఆసక్తి కలిగిస్తోంది. మిచిగాన్ కి చెందిన ఈ జంటకు కామెరూన్ ( Cameron) అనే 4 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. మార్చి నెలలో రెండవ బిడ్డగా ఆడశిశువుకి జన్మనిచ్చారు ఈ దంపతులు. ఆ చిన్నారికి ఆడ్రీ (Audrey) అని కూడా పేరు పెట్టుకున్నారు. ఇందులో విశేషం ఏం ఉంది అనుకుంటున్నారు కదా.. 138 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారి వంశంలో మొదటి ఆడ శిశువు జన్మించింది. మీరు విన్నది నిజమే. 1885 తర్వాత ఆండ్రూ వంశంలో ఆడపిల్లను చూడలేదట. ఈ విషయాన్ని తన భర్త ద్వారా తెలుసుకున్న కరోలిన్ కూడా చాలా ఆశ్చర్యపోయింది. ఆడ్రీ పుట్టకముందు కరోలిన్ కి రెండు సార్లు అబార్షన్స్ (miscarriages) అయ్యాయట. ఇక రెండవ బిడ్డగా ఎవరు పుట్టినా సరే ఆరోగ్యంగా ఉంటే చాలని ఆ దంపతులు కోరుకున్నారు. అయితే ఆ జంటకు ఆడపిల్ల పుట్టడంతో సంతోషానికి అవధులు లేకుండా పోయింది. కాగా ఇప్పటి వరకూ మగపిల్లలకు పేర్లు పెట్టగలిగిన ఆ కుటుంబానికి తమ కుమార్తెకు పేరు పెట్టడంలో కాస్త ఇబ్బంది ఎదురైందట. చివరకు ఆడ్రీ అనే పేరును సెలక్ట్ చేసుకున్నారు.

Kochi police: వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించారు .. మద్యం మత్తులో బస్సులు నడిపిన డ్రైవర్లకు పోలీసులు వింత శిక్ష..

ఆడ్రీ రాకతో కరోలిన్ సంతోషానికి అవధులు లేవు. తమ వంశంలో ఆడపిల్ల పుట్టాలనే ఎదురుచూపులకు ఆడ్రీ రాకతో తెరపడిందని ఆమె సంతోషంగా చెబుతోంది. తమ సమస్యలన్నీ ఆడ్రీ రాకతో తీరిపోయాయని ఆ కుటుంబం సంబరాలు జరుపుకుంటోంది. ఆడ్రీని కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఈ స్టోరి ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ అందరిలో ఆసక్తి రేపుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు