After Covid 19 Brazil Carnival Celebrations
after two years Brazil carnival : రెండేళ్ల విరామం తర్వాత కార్నివాల్ సందడి బ్రెజిల్‌ను ఊపేస్తోంది. సాంబ స్కూళ్ల నృత్యాలతో ప్రపంచ పర్యాటకులు పులకిస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన డ్యాన్సర్లతో రియో వీధులు కోలాహలంగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో జరగాల్సిన కార్నివాల్ ఒమిక్రాన్ వ్యాప్తితో వాయిదా పడింది.
ప్రపంచ పర్యాటకులందరినీ ఒక్కచోటకు చేర్చే బ్రెజిల్ కార్నివాల్ ఉత్సాహంగా సాగింది. రెండేళ్ల విరామం తర్వాత సాంబ డ్యాన్సులతో బ్రెజిల్ రాజధాని రియోడి జనిరో వీధుల్లో సందడి నెలకొంది. ఎక్కడచూసినా జనమే కనిపించారు. డ్యాన్సర్లు, డ్రమ్మర్లు ఉత్సాహంగా ఆడిపాడారు. కరోనా కాలంలో వాక్సినేషన్ సెంటర్లగా ఉపయోగిపడిన సాంబ్రా డ్రోమ్ మైదానాల్లో వేలాది మంది పర్యాటకులను కళాకారులు తమ డ్యాన్సులతో కొత్తలోకంలోకి తీసుకెళ్లారు.
బ్రెజిల్ కార్నివాల్ సందడి గురించి మాటల్లో వర్ణించలేం. బ్రెజిల్ నాగరికతకు, సాంస్కృతిక వైభవానికి ఈ కార్నివాల్ అద్దం పడుతుంది. రకరకాల వేషధారణల్లో చేసే డ్యాన్సులు, డ్రమ్ముల సంగీతంతో తన్మయత్వానికి లోనవ్వని వారుండరు. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య ఆటపాటలు ఉత్సాహంగా సాగుతాయి.
రెండేళ్ల క్రితం కార్నివాల్ జరిగే సమయానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా విరుచుకుపడింది. సాంబ డ్రోమ్‌లో 400 మంది కరోనా కాలంలో ఆశ్రయం పొందారు. కార్నివాల్ కోసం బ్రెజిల్ లో లక్షలమంది ఎదురుచూశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కార్నివాల్‌తో అనేకమంది ఉపాధి పొందుతారు. డ్యాన్సర్లు, డ్రమ్మర్లు నెలల తరబడి సాధన చేస్తారు.
బ్రెజిల్ రాజధాని రియో డి జనరీతో పాటు సావో పౌలోలో కార్నివాల్ జరుగుతుంది. రెండు నగరాల్లో ఫిబ్రవరి, మార్చిలో జరగాల్సిన కార్నివాల్ ఒమిక్రాన్ వ్యాప్తితో వాయిదా పడింది.