Chess Champion Gukesh : చెస్ ఛాంపియన్ గుకేష్‌కు ఎలన్ మ‌స్క్ అభినందనలు..!

Chess Champion Gukesh : ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ కూడా స్పందించారు. గుకేష్ చెస్ ఛాంపియన్‌షిప్ సాధించడంపై మస్క్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.

Gukesh's World Conquering Feat

Chess Champion Gukesh : భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ (18) ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నాడు. 14 గేమ్‌ల హోరాహోరీ పోరులో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను 7.5 – 6.5తో ఓడించాడు. తద్వారా అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా డి గుకేశ్ అవతరించాడు. ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న గుకేశ్‌పై భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

తాజాగా గుకేష్ విజయంపై ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ కూడా స్పందించారు. గుకేష్ చెస్ ఛాంపియన్‌షిప్ సాధించడంపై మస్క్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. గుకేష్.. కంగ్రాట్స్ అంటూ మస్క్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మస్క్ ట్వీట్ వైరల్ అవుతుంది.

టైటిల్ గెలుచుకున్న అనంతరం గుకేష్ మాట్లాడుతూ.. “నేను నా కలను మాత్రమే జీవిస్తున్నాను” అని గుకేష్ అన్నాడు. సింగపూర్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో లిరెన్‌ను మట్టికరిపించాడు. 2013 ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో తన ఆరాధ్యదైవం విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్‌సెన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యువ ఛాంపియన్ తన ఆకాంక్షలను ఎలా నెరవేర్చుకున్నాడో తెలిపాడు.

“2013లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో మాగ్నస్ కార్ల్‌సెన్, విషీ సర్‌లను చూసినప్పుడు.. ఒక రోజు గ్లాస్ రూమ్‌లో ఉండటం చాలా కూల్‌గా ఉంటుందని, వాస్తవానికి అక్కడ కూర్చుని, నా పక్కన భారత జెండాను చూడటం చాలా కూల్‌గా ఉంటుందని నేను అనుకున్నాను. మాగ్నస్ గెలిచినప్పుడు, 2017లో నేను ప్రపంచ ఛాంపియన్‌గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పాను” అని పీటీఐ వార్తా సంస్థ ఉటంకిస్తూ గుకేష్ అభిప్రాయపడ్డాడు.

మరోవైపు.. గుకేష్ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌లతో సహా పలువురి నుంచి పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ యువ గ్రాండ్‌మాస్టర్‌కు రూ. 5 కోట్ల రివార్డును కూడా ప్రకటించారు.

అతడి విజయాన్ని “స్మారక విజయం”గా పేర్కొన్నారు. చెస్ లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ కూడా మిస్టర్ గుకేష్‌ను ప్రశంసిస్తూ.. “అతను అన్నింటికంటే అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాడు. తన తల్లిని సంతోషపరిచాడు” అని పేర్కొన్నారు.

Read Also : Bihar Teacher Kidnap : బీహార్ టీచర్ కిడ్నాప్.. పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి.. బలవంతంగా పెళ్లి చేశారు..!