Air Canada flight after turbulence sends passenger meals flying around the cabin (Image Source : Google )
Air Canada flight : ఎయిర్ కెనడా విమానంలో అల్లకల్లోలం చోటుచేసుకుంది. వాతావరణ మార్పులతో విమానం ఒక్కసారిగా కుదుపులకు గురికావడంతో ప్రయాణీకులు గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో ప్రయాణికులు తినే భోజనం ట్రే టేబుల్‌ల నుంచి గాల్లోకి ఎగిరిపడింది. దాంతో విమానం క్యాబిన్ మధ్య ఆహార పదార్థాలు చెల్లాచెదరుగా పడ్డాయి.
మోరెల్ ఆండ్రూస్ రెడ్డిట్ పోస్ట్ ప్రకారం.. వాంకోవర్ నుంచి సింగపూర్‌కు బయలుదేరిన ఎయిర్ కెనడా ఎసీ19 విమానం టేకాఫ్ అయిన కొన్ని గంటల్లోనే భారీ కుదుపులకు గురైంది. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రయాణికులెవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఆండ్రూస్ చెప్పారు. విమానంలో చెల్లాచెదురుగా పడిన ఉన్న ఆహారానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ సీలింగ్ మొత్తం ఆహార పదార్థాలు చిమ్ముతున్న దృశ్యాలు కనిపించాయి.
అక్టోబరు 11న వాంకోవర్‌లో బయలుదేరిన 3 గంటల తర్వాత విమానం కొద్దిగా కుదుపులను ఎదుర్కొందని ఎయిర్ కెనడా సీబీఎస్ న్యూస్‌కి తెలిపింది. ప్రయాణీకులు లేదా సిబ్బందిలో ఎవరూ గాయపడలేదని కెనడా ఎయిర్‌లైన్ ధృవీకరించింది. విమానం షెడ్యూల్ ప్రకారం.. సింగపూర్‌కు ఎట్టకేలకు చేరుకుంది. ఈ ఘటన నుంచి తేరుకున్నాక విమానంలో ప్రయాణికుల్లో ఒకరు మాట్లాడుతూ.. చాలా భయపడ్డారని, ఇంతకుముందు ఎప్పుడూ అలాంటి అల్లకల్లోలం జరగలేదని చెప్పారు.
కొన్ని సెకన్ల పాటు రోలర్ కోస్టర్‌లలో మాదిరిగా ఆహారం కనిపించిందని మరో యూజర్ పోస్టు చేశాడు. కొంత ఆహారం ప్రయాణికుల జుట్టుపై పడిందని, క్యాబిన్ నిండా ఆహారం పడి ఉండటం కనిపిస్తుందని చెప్పారు. సీలింగ్ నుంచి తనపై కాఫీ పడిందని చెప్పుకొచ్చారు. ఇటీవలి సంవత్సరాలలో విమానంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. గత మేలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ బ్యాంకాక్, థాయిలాండ్ నుంచి ఒక విమానం లండన్ హీత్రూ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో అకస్మాత్తుగా కుదుపులను ఎదుర్కొంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించగా డజన్ల కొద్దీ గాయపడ్డారు.
ఆన్‌లైన్ ఫ్లైట్ ట్రాకింగ్ ఆర్గనైజేషన్ ఫ్లైట్‌అవేర్ సమాచారం ప్రకారం.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 సంఘటన జరిగిన 5 నిమిషాల వ్యవధిలో 6వేలు అడుగులు కిందికి పడిపోయిందని, ఆ ప్రాంతంలో పిడుగులు పడ్డాయని పేర్కొన్నారు. 2023లో సెప్టెంబరులో ఈక్వెడార్ నుంచి ఫోర్ట్ లాడర్‌డేల్‌కు వెళ్లే జెట్ బ్లూ ఫ్లైట్ కుదుపులకు గురికావడంతో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Read Also : How To Get WiFi Password : మీ వై-ఫై పాస్‌వర్డ్ మరిచిపోయారా? ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ నుంచి ఇలా రికవరీ చేయొచ్చు!