Air India: మాల్దీవుల్లో అత్యద్భుతమైన స్వాగతం అందుకున్న ఎయిరిండియా విమానం

మాల్దీవుల్లో ల్యాండ్ అయిన ఎయిరిండియా AI-267కు అత్యద్భుతమైన స్వాగతం దక్కింది. 1976 నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు నడిపిస్తున్న ఎయిరిండియాకు వాటర్ కెనాన్ సెల్యూట్ సమర్పించారు.

Air India: మాల్దీవుల్లో అత్యద్భుతమైన స్వాగతం అందుకున్న ఎయిరిండియా విమానం

Air India

Updated On : February 21, 2022 / 5:03 PM IST

Air India: మాల్దీవుల్లో ల్యాండ్ అయిన ఎయిరిండియా AI-267కు అత్యద్భుతమైన స్వాగతం దక్కింది. 1976 నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు నడిపిస్తున్న ఎయిరిండియాకు వాటర్ కెనాన్ సెల్యూట్ సమర్పించారు. మాల్దీవుల్లోని మాలె ఎయిర్‌పోర్టుకు చేరుకున్న విమానానికి గగనానికి తాకేంత ఎత్తులో చెరో వైపు వాటర్ గన్ లు సంధించి పరస్పరం ఢీకొంటూ పడే నీటి తుంపరలలో నుంచి విమానం ల్యాండ్ అయింది.

అంతర్జాతీయ విమాన సర్వీసులను 23నెలల తర్వాత ఏప్రిల్ లో పునరుద్ధరించనుంది ఎయిరిండియా. దీనిపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం. దేశీయ సర్వీసులను నడుపుతుండటంతో విదేశీ సర్వీసులకు ఎంతో సమయం పట్టదని భావిస్తున్నారు.

కొవిడ్ మహమ్మారికి ముందు 2వేల 800 విమానాలను నడిపిన డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం ఫిబ్రవరి 20న 2వేల 58 సర్వీసులను నడిపింది. అంటే దాదాపు 80శాతం పూర్తి చేసినట్లే. 2021 డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాలను నడపాలని ప్లాన్ చేసింది విమానయాన శాఖ. ఒమిక్రాన్ కేసులు పెరగడంతో నిర్ణయాన్ని మార్చుకుని ఫిబ్రవరి 28వరకూ నిషేదాన్ని పొడిగించింది.

Read Also: పైలట్ సమయస్ఫూర్తి.. తప్పిన పెను ప్రమాదం