ఎయిర్ పోర్టులో బూట్లలో స్పైడర్ల స్మగ్లింగ్.. పార్శిల్‌లో 119 టరాన్టులా జాతి సాలీడులు

  • Publish Date - November 3, 2020 / 10:19 AM IST

Live Tarantulas Hidden Inside A Pair Of Shoes : ఫిలిప్పీన్స్‌లోని విమానాశ్రయ సిబ్బంది అక్రమంగా రవాణా చేస్తున్న సాలీడులను గుర్తించారు. ఒక జత బూట్ల లోపల దాచిపెట్టిన 119 టరాన్టులా జాతి సాలీడులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యూరో ఆఫ్ కస్టమ్స్ ఈ విషయాన్ని తమ ఫేస్‌బుక్‌లో పోస్టులో వెల్లడించింది.

Ninoy Aquino International Airport (NAIA) సిబ్బంది పోలాండ్ నుండి వచ్చిన Michal Krolicki అనే కొన్ని ప్రత్యేకమైన పార్శిల్‌లో ఈ రకమైన సాలీడులను గుర్తించారు. జనరల్ ట్రయాస్‌లోని కావిట్‌ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి పంపుతున్నట్లు పార్శిల్‌పై ఉంది.



ఎయిర్ పోర్టులో గత అక్టోబర్ 28న వింత ఆకారంలో కనిపించిన ఒక పార్శిల్‌ను గమనించిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. అనుమానంతో విప్పి చేశారు. అందులో జత బుట్లలో బతికే ఉన్న 119 టరాన్టులా జాతి సాలీడులను అధికారులు గుర్తించారు.

ఆ సాలీడులను ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఉంచారు. ఈ సాలీడులు దాచిన పెట్టెలను Asics రన్నింగ్ బూట్ల జత లోపల దాచిపెట్టి అక్రమంగా పోలాండ్ నుంచి రవాణా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సాలీడుల ఫోటోలను అధికారిక ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు.



స్వాధీనం చేసుకున్న టరాన్టులా సాలీడులను అక్టోబర్ 29న డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్ అండ్ నేచురల్ రిసోర్సెస్ వైల్డ్ లైఫ్ ట్రాఫిక్ మానిటరింగ్ యూనిట్ (DENR WTMU)కు అప్పగించారు. పార్శిల్ ఎవరి అడ్రస్‌కు పంపించారో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. టరాన్టులా జాతి సాలీళ్లు పెద్దగా, వెంట్రుకలతో కనిపిస్తుంటాయి.
https://10tv.in/ap-prakasham-special-cock-story-poultry-breeder/
ఈ జాతి సాలీళ్లను కొన్ని ప్రాంతాల్లో పెంచుకుంటారు కూడా. గత ఏడాదిలో ఓట్ మీల్, కూకీ బాక్సుల్లో 757 బతికి ఉన్న టరాన్టులా సాలీడులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.



ప్లాస్టిక్ డబ్బాల్లో రవాణా చేస్తున్న 87 బతికి ఉన్న సాలీడ్లను గుర్తించారు. అంతరించిపోతున్న వైల్డ్ లైఫ్ జాతి సాలీడులను అక్రమంగా రవాణా చేసినా లేదా వ్యాపారం చేసినా భారీ జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష, ఒక రోజు నుంచి ఏడాది వరకు జైలు శిక్ష విధించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు