All 62 aboard dead as plane crashes in fiery wreck (Image Source : Google )
Brazil Plane Crash : బ్రెజిల్‌లోని సావో పాలో సమీపంలో ఘోరప్రమాదం జరిగింది. 62 మందితో ప్రయాణిస్తున్న ప్రాంతీయ టర్బోప్రాప్ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 58 మంది ప్రయాణికులు, 4 మంది సిబ్బంది మొత్తం దుర్మరణం చెందారు. ఈ మేరకు క్రాష్ సైట్ సమీపంలోని స్థానిక అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏటీఆర్-నిర్మిత విమానం నియంత్రణ లేకుండా గాల్లోనే చక్కర్లు కొడుతున్నట్టుగా కనిపించింది.
? A passenger plane has crashed in Sau Paulo state in Brazil. It was travelling from Cascavel to Guarulhos. No details as to how many people were on board…pic.twitter.com/IbbirMrV53
— Volcaholic ? (@volcaholic1) August 9, 2024
ఇళ్ళకు సమీపంలో ఉన్న చెట్ల వెనుకకు వెళ్లి పడిపోయింది. ఆ తర్వాత విమానం కూలిన ప్రాంతంలో పెద్ద ఎత్తున నల్లటి పొగలు గాల్లోకి వ్యాపించాయి. విమానంలోని ప్రయాణికులు ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని, స్థానిక కండోమినియం కాంప్లెక్స్‌లోని ఒక ఇల్లు మాత్రమే దెబ్బతిన్నదని, నివాసితులు ఎవరూ గాయపడలేదని విన్‌హెడో సమీపంలోని వాలిన్‌హోస్‌లోని నగర అధికారులు పేర్కొన్నారు. విమానం సావో పువాలోలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
All 62 passengers and crew died in the plane crash in Brazil according to the governor. No survivors! https://t.co/aOFjG35LQh
— Volcaholic ? (@volcaholic1) August 9, 2024
ప్రమాదంలో మృతులకు ఒక్క నిమిషం మౌనం పాటించాలని కోరారు. పరానా రాష్ట్రంలోని కాస్కావెల్ నుంచి సావో పాలో ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమానం సావో పాలోకు వాయువ్యంగా 80 కిలోమీటర్లు (50 మైళ్ళు) దూరంలో ఉన్న విన్హెడో పట్టణంలో కూలిపోయిందని ఎయిర్‌లైన్ వోపాస్ తెలిపింది. పీఎస్-వీపీబీ రిజిస్ట్రేషన్ ఉన్న విమానం కూలిపోవడానికి కారణం ఏమిటనే దానిపై మరింత సమాచారం అందించలేమని విమానయాన సంస్థ తెలిపింది.
ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల తర్వాత సావో పాలో రాష్ట్ర అగ్నిమాపక దళం, మిలిటరీ పోలీసులు, సివిల్ డిఫెన్స్ అథారిటీ బృందాలు సహా ఏడుగురు సిబ్బందిని విన్‌హెడోలోని క్రాష్ జరిగిన ప్రదేశానికి తరలిస్తున్నట్లు తెలిపింది. ఈ విమానాన్ని ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్ రాడార్ 24 ఏటీఆర్ 72-500 టర్బోప్రాప్‌గా జాబితా చేసింది.
మరోవైపు.. గౌరుల్‌హోస్‌లోని సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమానం కూలిపోయిందని ఎయిర్‌లైన్ (VoePass) ఒక ప్రకటనలో ధృవీకరించింది. ప్రమాదానికి కారణమేమిటో ప్రకటనలో వెల్లడించలేదు.
Read Also : European City : ఈ యూరోపియన్ సిటీలో కేవలం 10 సెకన్లలో 3 దేశాలను చుట్టేయొచ్చు..!