Putin Message (Photo Credit : Google)
Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్ తగ్గేదేలే అంటున్నాడు. యుక్రెయిన్ తో యుద్ధంలో రష్యా నిర్దేశించిన అన్ని లక్ష్యాలను సాధిస్తుందని ఆయన ప్రతిజ్ఞ చేశారు. రీ యూనిఫికేషన్ డే రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పుతిన్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో ఆయనీ ప్రతిజ్ఞ చేశారు. కాగా.. రష్యా అధికారికంగా డోనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజ్జియా, ఖెర్సన్ ప్రాంతాలు తమ సొంతమని ప్రకటించి రెండేళ్లు అవుతోంది. దీన్ని రీ యూనిఫికేషన్ డే జరుపుకుంటోంది. రష్యా ఆక్రమిత ప్రాంతాలను ఏకపక్షంగా రష్యన్ ఫెడరేషన్‌లో చేర్చడానికి పుతిన్ పత్రంపై సంతకం చేయడంతో 30 సెప్టెంబర్ 2022న రష్యా నాలుగు ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించింది.
”నిజం మన వైపు ఉంది. నిర్దేశించిన అన్ని లక్ష్యాలు సాధించబడతాయి” అని పుతిన్ తన వీడియో సందేశంలో తెలిపారు. వెస్ట్రన్ ఎలైట్స్ పై పుతిన్ ఫైర్ అయ్యారు. రష్యాను లక్ష్యంగా చేసుకున్న మిలటరీ బేస్ అయిన యుక్రెయిన్ ను వెస్ట్రన్ ఎలైట్స్ తమ కాలనీగా మార్చుకున్నాయని మండిపడ్డారు. ”ఈ రోజు మనం మన పిల్లలు, మనవళ్ల సురక్షితమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం” అని పుతిన్ అన్నారు.
Also Read : ఆ 30వేల మంది భారతీయులు ఏమయ్యారు? ఆందోళనకు గురిచేస్తున్న సైబర్ స్లేవరీ..