Pfizer/BioNTech Covid jab : ఇద్దరు వర్కర్లకు తీవ్ర అస్వస్థత

  • Publish Date - December 10, 2020 / 08:17 AM IST

Allergy warning over new jab : కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రపంచదేశాలు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కొంతమందికి వ్యాక్సిన్ లు ఇస్తున్నారు. అయితే..కొన్ని కొన్ని దేశాల్లో ఇవి వికటిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ…దీనిని ప్రారంభించి 24 గంటలు గడవకుండానే..సమస్యలు తలెత్తాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ కు చెందిన ఇద్దరు వర్కర్లకు ఫైజర్ బయోఎన్ టెక్ వ్యాక్సిన్ ఇచ్చారు.



కానీ..కొద్దిసేపటి తర్వాత..వీరిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్క రోజులోనే వారికి ఒళ్లంతా దుద్దుర్లు, రక్తప్రసరణలో తేడాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో యూకే డ్రగ్ రెగ్యులేటరీ ఏజెన్సీ అలర్ట్ అయ్యింది.
మందులు తీసుకోవడం, ఆహారం తీసుకున్న తర్వాత..అలర్జీ వచ్చే వాళ్లకు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి రావొద్దని (Medicines and Healthcare products Regulatory Agency) హెచ్చరించింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన వారి హెల్త్ మెడికల్ హిస్టరీని పరిశీలించాలని ఆదేశించింది. అలర్జీలు ఉన్నాయని తేలితే..వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వొద్దని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.



ఏదైనా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్ లు రావడం సహజమేనని Professor Stephen Powis (medical director for the NHS in England) అన్నారు. ఎందుకైనా మంచిదని వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చే వారి మెడికల్ హిస్టరీ చూడాలని సూచించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ హెల్త్ వర్కర్లు ఇద్దరూ కోలుకుంటున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు. తమకు అనుభవం ఉందని, ప్రస్తుతం సరైన చర్య తీసుకుంటామని Dr June Raine (head of the MHRA) తెలిపారు. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, ప్రస్తుతం జూనియర్ వాణిజ్య మంత్రిగా ఉన్న నాదిమ్ జహావిని కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీకి ఇన్ చార్జిగా నియమించారు.

ట్రెండింగ్ వార్తలు