టర్కీ కోడికి క్షమాభిక్ష పెట్టిన ట్రంప్..శ్వేతసౌథంలో ఆసక్తికర సంప్రదాయం

  • Publish Date - November 25, 2020 / 06:47 PM IST

America : donald trump turkey as a finishing white house act : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓ కోడికి క్షమాబిక్ష పెట్టారు. టర్కీ నుంచి వచ్చిన ఆ కోడిని ‘నీకు పూర్తి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నాను..బతికి పో..హ్యాపీగా ఉండు’ అంటూ వదిలేశారు. వైట్ ‌హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమం వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంది. ఎంతో కాలం నుంచి వస్తున్న ఈ ఆసక్తికర విషయం వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందాం..



(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అమెరికా ఎంత పాశ్చాత్య దేశమైనా వారికి కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి. అలవాట్లను మనం సంప్రదాయాలు అంటాం. అలా అనుకుంటే అమెరికాలోని శ్వేత సౌథం (వైట్ హౌస్)కి కూడా ఓ సంప్రదాయం ఉంది. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పకతప్పదు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});

టర్కీ కోడికి ట్రంప్ క్షమాభిక్ష కారణమేంటీ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ టర్కీ కోడిని క్షమించేశారు. బతికిపో నా పేరు చెప్పుకుని అంటూ వదిలేశారు. ట్రంప్ కోడికి క్షమాభిక్ష పెట్టడమేంటి? దీని వెనుక పెద్ద చరిత్రే ఏంటంటే..అధికారం నుంచి దిగిపోయే అమెరికా అధ్యక్షులకు టర్కీ నుంచి కోళ్లను బహుమతిగా పంపిస్తారు. సదరు అధ్యక్షుడు ఇష్టమైతే వాటిని వండుకుని (అదేనండీ వండించుకుని) తినడమో..లేదా వదిలేయడమో చేస్తారు. ఇది వైట్ హౌస్‌లో ఆనవాయితీగా వస్తున్న పద్ధతి.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});

అయితే.. జో బైడెన్‌ విజయాన్ని వ్యతిరేకించి ఎట్టకేలకు దిగి వచ్చి ఆయనకు అధికార బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రంప్.. ఇక శ్వేతసౌధం (White House) సంప్రదాయాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. దీంట్లో భాగంగానే పదవి నుంచి దిగిపోయిన అధ్యక్షులకు టర్కీనుంచి పంపించిన కోడిని ట్రంప్ తినకుండా క్షమించి వదిలేసారు. అదన్నమాట ట్రంప్ కోడిని క్షమించేసిన అసలు విషయం.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కాగా..వైట్ ‌హౌస్‌లో సంప్రదాయం ప్రకారం నిర్వహించే ‘థ్యాంక్స్‌ గివింగ్‌ డే’లో డొనాల్డ్ ట్రంప్, మెలానియా దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు సంప్రదాయంగా వస్తున్న ‘ది నేషనల్‌ థ్యాంక్స్‌ గివింగ్‌ టర్కీ’ వేడుక జరిగింది.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో జరిగిన ఆ కార్యక్రమంలో ట్రంప్ తనదైన శైలిలో జోకులు వేస్తూ చాలా చాలా ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా ‘కార్న్‌ (Corn)’ అనే టర్కీ కోడిని క్షమించి ప్రాణభిక్ష పెట్టారు. దీంతో పాటు ‘కోబ్‌’ (Cob) అనే టర్కీ కోడిని కూడా క్షమించి వదిలేశారు. అనంతరం రుచికరమైన వంటకాలతో విందు కొనసాగింది.తనకిష్టమైన వంటకాలను ట్రంప్ రుచిచూశారు.



అమెరికాకు టర్కీ కోళ్ల బహుమానం
ఏటా Thanks Giving Day కు ముందు అధ్యక్షుడికి ‘ది నేషనల్‌ టర్కీ ఫెడరేషన్’ రెండు భారీ టర్కీ కోళ్లను బహూకరిస్తుంది. జార్జి డబ్ల్యూ బుష్‌కు ముందు అధ్యక్షులందరూ ఇలా బహుమతిగా వచ్చే టర్కీ కోళ్లను విందులో చక్కగా ఆరగించేవారు. కానీ జాన్‌ ఎఫ్‌ కెనడీ, రిచర్డ్‌ నిక్సన్‌, జిమ్మీ కార్టర్‌ తదితరులు మాత్రం ఈ కోళ్లను తినకుండా వదిలేశారు. అంటే వాటికి జీవించే హక్కుని ఇచ్చారన్నమాట. ఇలా కొంత మంది అధ్యక్షులు ఆ కోళ్లను స్వీకరించనేలేదు.



1989లో అధికారికంగా జార్జి హెచ్‌ డబ్ల్యూ బుష్‌ అధక్ష్య క్షమాభిక్ష అనే పదాన్ని వాడి బహుమతిగా వచ్చిన టర్కీ కోడిని జీవించేందుకు వదిలేశారు. నాటి నుంచి వైట్ హౌస్‌లో ఇది సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయన్ని ట్రంప్ కూడా పాటించారు. టర్కీ కోళ్లకు క్షమాభిక్ష పెట్టి జీవించటానికి వదిలేశారు. ఎలాగైనా ట్రంప్ స్టైలే వేరబ్బా..





అలాంటి ఇలాంటి కోళ్లు కాదు మరి..!
టర్కీ కోళ్లకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, అగ్రరాజ్యం.. అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే కోళ్లంటే మాటలు కాదు కదా! అందుకే ఈ కోళ్లను ఎంపిక చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దేశవ్యాప్తంగా సుమారు 100 వరకు కోళ్లను ఎంపిక చేసి.. వాటిని వివిధ దశల్లో ప్రత్యేకించి వేరు చేసి సెలక్ట్ చేస్తారు.  వాటిలో ఉత్తమమైన రెండు కోళ్లను ఎంపిక చేసి అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా పంపిస్తారు.



అబ్రహం లింకన్‌ ‘కోడి’ సెంటిమెంట్!
1863లో అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ కుటుంబానికి విందు కోసం టర్కీ నుంచి కొన్ని కోళ్లను గిఫ్ట్‌గా పంపించారు. అయితే.. అంతకు ముందు ఏడాదే అబ్రహం లింకన్‌ కొడుకు టెడ్‌, విలియంలకు టైఫాయిడ్‌ సోకింది. ఆ జ్వరానికి విలియం ప్రాణాలు విచిచాడు. అలా ప్రాణాలతో బయటపడ్డ టెడ్‌కు ఆ టర్కీ కోడి బాగా నచ్చింది. దాన్ని చంపవద్దని..దయచేసి దాన్ని బతకనివ్వాలని తండ్రి లింకన్‌ను కోరాడు. విలియం కోరికను లింకన్ మన్నించారు. అలా ఆకోడికి టెడ్ ‘జాక్‌’ అని పేరుపెట్టి చాలా ప్రేమగా పెంచుకున్నాడు. అమెరికా అధ్యక్షుడికి గిఫ్ట్‌గా వచ్చిన జీవిని పెంచుకున్న తొలి ఘటన ఇదే కావటం గమనించాల్సినవిషయం.



ఇక ప్రస్తుతం.. ట్రంప్ క్షమించి వదిలేసిన టర్కీ కోళ్లు కార్న్‌, కోబ్‌లను‌ ఐయోవా యూనివర్సిటీకి తరలించారు. ఇక ఈ రెండు పక్షులు అక్కడే గడపనున్నాయన్నమాట. మరి ట్రంప్ చేతిలోంచి బతికి బయటపడ్డ ఆటర్కీ కోళ్లు చాలా చాలా అదృష్టవంతులైనట్లే..

ట్రెండింగ్ వార్తలు