Boy fires gun : తండ్రిని అరెస్ట్​ చేస్తున్న పోలీసులపై నాలుగేళ్ల పిల్లాడు కాల్పులు

తండ్రిని అరెస్ట్​ చేస్తున్న పోలీసులపై నాలుగేళ్ల పిల్లాడు గన్ తో గురి చూసి మరీ కాల్పులు జరిపాడు.

4 Years Old Boy Fires Gun On Police

4 Years old Boy fires gun on police: నాలుగేళ్ల పిల్లాడికి తుపాకి అంటే ఏంటో తెలీదు. కానీ తన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయటం చూసిన ఆ బుడ్డోడు ఏకంగా పోలీసులకు గన్ గురిపెట్టాడు.అక్కడితో ఊరుకోలేదా చిచ్చరపిడుగు. పోలీసులపై కాల్పులు జరిపాడు. కారులో కూర్చున్న ఆ పిల్లాడు కారు విండోలోంచి తుపాకీ పట్టుకుని కారు కాల్పులు జరిపిన ఘటన అమెరికాలో జరిగింది. కానీ బుడ్డోడు గురి పెట్టి కాల్చిన తుపాకీ బులెట్ మాత్రం గురి తప్పింది. ఆ పక్కనే ఉన్న మెక్​డొనాల్డ్​​ పైకప్పుకు తగిలింది. దీంతో పోలీసులకు చావు అతిదగ్గరకగా వచ్చి దూరంగా వెళ్లినట్లు అయ్యింది.కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ పిల్లాడికి పోలీసుల్ని కాల్చేయమని తండ్రే చెప్పాడని పోలీసులు అంటున్నారు..!!

Also read : Gun Firing in US school : అమెరికాలోని స్కూల్‌లో 15 ఏళ్ల బాలుడు కాల్పులు.. ముగ్గురు విద్యార్థుల మృతి

ఈ ఘటన విషయానికి వస్తే..అమెరికాలోని సబర్బన్ సాల్ట్ లేక్ సిటీ మెక్‌డొనాల్డ్స్ డ్రైవ్-త్రూ వద్దకు ఓ వ్యక్తి తన నాలుగేళ్ల కొడుకుని తీసుకుని వచ్చాడు. ఇద్దరు మెక్​డొనాల్డ్​ డ్రైవ్​ ఇన్​కు వెళ్లారు. వారు ఇచ్చిన ఆర్డర్​ విషయంలో సిబ్బందికి, బాలుడి తండ్రికి గొడవ జరిగింది. మాటా మాటా పెరిగింది. అది ఘర్షణదాకా వెళ్లింది. చిన్న చిన్న మాటలు కాస్తా ఘర్షణకు దారి తీయటంతో బాలుడికి తండ్రి సిబ్బందిని తన వద్ద ఉన్న తుపాకీతో బెదిరించాడు.

దీంతో మెక్ డొనాల్డ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకోవటానికి యత్నించారు. సరిగ్గా అదే సమయంలో కారులో కూర్చున్న నాలుగేళ్ల పిల్లాడు తన తండ్రిని పోలీసులు పట్టుకునేసరికి భయపడ్డాడు. ఆ చిన్నపిల్లాడికి తన తండ్రితో పోలీసులు పెనుగులాడటం చూసి కారులోనే ఉన్న గన్ తీసాడు. వెంటనే తన తండ్రిని పట్టుకున్న పోలీసులపై కాల్పులు జరిపాడు.

Also read : Firing : అమెరికాలో కాల్పుల కలకలం.. ప్రముఖ ర్యాపర్ మృతి

బాలుడు తుపాకీతో కాల్చుతుండగా గమనించిన ఓ అధికారి సహోద్యోగిని హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సదరు పోలీసులు చటుక్కున పక్కకు తప్పుకోవడం వల్ల ప్రమాదం తప్పింది. ఆ గన్ లో బుల్లెట్ గురి తప్పి మెక్ డొనాల్డ్ పైకప్పుకు తగిలింది. తరువాత తండ్రీని కొడుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు .తరువాత తండ్రే తమను గన్ తో కాల్చేమని కొడుక్కి చెప్పాడని తెలిపారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే..సదరు నాలుగేళ్ల పిల్లాడు తుపాకి పట్టడం ఇది మొదటిసారి కాదని చెబుతున్నారు పోలీసులు. గన్​ ఫైర్​పై.. ఆ తండ్రే కుమారునికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడని ఇటువంటి ఘర్షణలు జరిగినప్పుడు కాల్చేయమని తండ్రే చెప్పాడంటున్నారు.

Also read : అమెరికాలో కాల్పులు..ఆరుగురు మృతి

పిల్లాడు తుపాకీ పట్టుకుని కాల్చిన విధానం చూస్తే..ఆ పిల్లాడు గన్ పట్టుకోవటం మొదటిసారి కాదనిపిస్తోంది. గురి తప్పకుండా కాల్చాడని తమ తోటి పోలీసులు హెచ్చరింటంతో పక్కకు తప్పుకోవటంతో ప్రమాదం తప్పిందని లేకుంటే గురి సూటిగా వచ్చి తన శరీరంలోకి దూసుకుపోయేదని తెలిపాడు బుల్లెట్ నుంచి తప్పించుకున్న పోలీసులు అధికారి.దీన్ని బట్టి తండ్రే ఆ నాలుగేళ్ల పిల్లాడికి తుపాకీ పేల్చటం నేర్పించి ఉంటాడని అంటున్నారు.