‘Patagonia’ Yvon Chouinard : పర్యావరణాన్ని కాపాడేందుకు రూ. 24 వేల కోట్ల కంపెనీని దానం చేసిన వ్యాపారవేత్త

పర్యావరణాన్ని కాపాడేందుకు..పరిరక్షించేందుకు ఓ బిలియనిర్ ఏకంగా తన యావదాస్తిని రాసి ఇచ్చేశారు. పెటగోనియా ఫ్యాషన్‌ సంస్థ ఫౌండర్‌ ‘యోవోన్‌ చుయ్‌నార్డ్‌’ రూ.24 కోట్ల విలువ చేసే కంపెనీని విరాళంగా ఇచ్చేశారు.

‘Patagonia’ Yvon Chouinard : పర్యావరణాన్ని కాపాడేందుకు..పరిరక్షించేందుకు ఓ బిలియనిర్ ఏకంగా తన యావదాస్తిని రాసి ఇచ్చేశారు. ఆ గొప్ప వ్యక్తి పెటగోనియా ఫ్యాషన్‌ సంస్థ ఫౌండర్‌ ‘యోవోన్‌ చుయ్‌నార్డ్‌’. పర్యావరణాన్ని పరిరక్షించటానికి శాస్త్రవ్తేత్తలు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రభుత్వాలకు..ప్రజలకు ఎన్నో కీలక సూచనలు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకృతి ప్రేమికులు కూడా కృషి చేస్తున్నారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరెందరో తమకు తోచిన సహాయం చేస్తుంటారు.

కానీ ఏకంగా వేల కోట్ల రూపాయల్ని దానంగా ఇవ్వటం అంటే మాటలు కాదు. దానికి ఎంతో గొప్ప మనస్సు ఉండాలి.పర్యావరణ పరిరక్షణ కోసం అంకిత భావం ఉండాలి. అన్ని అన్ని గొప్పగుణాలు ఉన్న వ్యక్తిగా వేల కోట్ల రూపాయల విలువైన కంపెనీలో విరాళంగా ఇచ్చి గొప్పవ్యక్తిగా నిలిచారు అమెరికా బిలియనీర్ పెటగోనియా ఫ్యాషన్‌ సంస్థ ఫౌండర్‌ ‘యోవోన్‌ చుయ్‌నార్డ్‌’.

పెటగోనియా ఫ్యాషన్‌ సంస్థ ఫౌండర్‌ యోవోన్‌ చుయ్‌నార్డ్‌ రూ.24 వేల కోట్ల విలువైన తన వాటాలతోపాటు..తన కుటుంబ వాటాలన్నింటినీ ఓ స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేశారు. ఈ మొత్తాన్ని వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం, అటవీ భూముల సంరక్షణకు పాటుపడే సంస్థలు, కార్యక్రమాలకు వెచ్చించనున్నారు. సదరు సంస్థకు రాసిన లేఖలో యోవోన్‌ చుయ్‌నార్డ్ ‘ఈ భూమే ఇప్పుడు మనకున్న ఏకైక వాటాదారు’ అంటూ వెల్లడించారు.

అవుట్‌డోర్ దుస్తులకు సంబంధించిన అమెరికన్ రిటైలర్ కంపెనీ అయిన పటగోనియా వ్యవస్థాపకుడు వైవోన్ చౌనార్డ్..50 ఏళ్ల క్రితం ప్రారంభించిన మొత్తం వ్యాపారాన్ని విరాళంగా ఇచ్చారు. తన వ్యాపారంలో భార్య, పిల్లలు కూడా వాటాదారులుగా ఉన్నారు. చౌనార్డ్ వారి వాటాలను కూడా విరాళంగా ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన వాతావరణ మార్పుల తీవ్రతను వివరిస్తూ.. “అభివృద్ధి చెందుతున్న గ్రహం గురించి మనకు ఏదైనా ఆశ ఉంటే-చాలా తక్కువ వ్యాపారం-అది మన వద్ద ఉన్న వనరులతో మనం చేయగలిగినదంతా చేయడానికి మనందరినీ తీసుకువెళుతుంది. ఇది మనం చేయగలం. ” అని పేర్కొన్నారు. న్యూయార్క్స్ టైమ్స్ ప్రకారం కంపెనీ విలువ సుమారు $3 బిలియన్లు.

 

ట్రెండింగ్ వార్తలు