చిన్నారులపై అశ్లీల చిత్రాలు..కామాంధుడికి 600 ఏళ్ల జైలు శిక్ష..!!

  • Publish Date - October 3, 2020 / 11:40 AM IST

American court imposes 600 years sentence on offender: ఓ కామాంధుడికి న్యాయస్థానం 600 ఏళ్లు జైలుశిక్ష వేసింది. ఏంటీ ఒక మనిషి జీవితకాలం మహా అయితే 100 ఉంటుంది..లేదా మరో 20..30 సంవత్సరాలు వేసుకోవచ్చు. కానీ 600ల సంవత్సరాల జైలుశిక్ష ఏంటీ అనే డౌట్ రావచ్చు..కొన్ని తీవ్రమైన నేరాల్లో న్యాయస్థానాలు నేరం నిరూపించబడినవారికి 10 సార్లు మరశిక్ష అమలు చేయాలని..ఇలా వందల సంవత్సాల జైలుశిక్ష వంటివి విధిస్తుంటుంది.


అంటే నేరస్థుడికి ఒకసారి మరణశిక్ష విధించాక అతను ప్రాణాలతో ఉండడు…కానీ నాలుగుసార్లు మరణశిక్ష అంటే ఆ నేరం అంత తీవ్రమైనది అర్థం. అలాగే అమెరికాలో చిన్నారులపై నేరాలను ప్రోత్సహించే ఓ కామాంధుడికి న్యాయస్థానం ఇలా 600ల ఏళ్లు జైలుశిక్ష విధిస్తు సంచలన తీర్పునిచ్చింది…


వివరాల్లోకి వెళితే..అమెరికాలో చిన్నారులపై లైంగిక చర్యలను ప్రోత్సహించడమే కాక..వాటిని వీడియోలు తీసిన నేరాలను ప్రోత్సహించిన కాటన్‌డేల్‌కు చెందిన నిందితుడు టేలర్ మిల్లర్ అనే 32 ఏళ్ల యువకుడికి కోర్టు 600ల సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అతనిపై మోసిన అన్ని ఆరోపణలు నిర్ధారణ కావటంతో అభం శుభం తెలియని చిన్నారులపై ఇటువంటి హింసలను ప్రోత్సహించిన టేలర్ తీవ్రమైన శిక్షార్హుడని కోర్టు అభిప్రాయపడింది. టేలర్ పై వచ్చిన అన్ని అభియోగాలను పూర్తి వాస్తవాలని తేల్చిన అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి స్కాట్ కూగ్లర్ ఈ తీర్పునిచ్చారు.


2014-2019 సంవత్సరాల మధ్య టేలర్ మిల్లర్ ఈ దారుణాలకు ఒడిగట్టినట్టు ఎఫ్‌బీఐ ప్రత్యేక ప్రతినిధి జానీ షార్ప్ జూనియర్ తెలిపారు. బాధితుల్లో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని న్యాయవాదులు పేర్కొన్నారు.


విచారణలో భాంగా టేలర్ రూమ్ గాలించినప్పుడు 102 అశ్లీల చిత్రాల వీడియోలు దొరికాయని తెలిపారు. టేలర్ 12 ఏళ్ల లోపున్న చిన్నారిపైనా అత్యాచారం చేసినట్టు అతడిపై ఆరోపణలు నిరూపించబడ్డాయి. టేలర్ మిల్లర్ తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు శుక్రవారం (అక్టోబర్ 2,2020) కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.