New infectious Disease In north Korea
New Infectious Disease in North Korea : కరోనాతో వణికిపోతున్న కిమ్ రాజ్యంలో మహ్మరి గురించి ఏమాత్రం టెన్షన్ లేకుండా గడిపింది. కానీ ప్రపంచం అంతా కోవిడ్ నుంచి రిలాక్స్ అయిన వేళ ఉత్తరకొరియాలో కరోనా మహమ్మారి పడగవిప్పింది. Covid కేసులు నమోదు అవుతు కిమ్ రాజ్యం ఆందోళన పడుతున్న వేళ కొత్తగా బుధవారం (15,2022) మరో అంటువ్యాధి వెలుగులోకి వచ్చి ఆందోళన కలిగిస్తోంది. ఈ అంటువ్యాధి ఏమిటి అనేది అంతచిక్కకపోవటంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
ఉత్తరకొరియాలోని ఓడరేవు నగరమైన హేజులో ప్రజలు అంతుచిక్కన అంటువ్యాధితో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. ఇది పేగు సంబంధిత వ్యాధిగా గుర్తించారు. ఈ క్రమంలో బాధితులకు అవసరమైన మందులను అందిస్తున్నారని జాతీయ అధికార మీడియా సంస్థ KCNA తెలిపింది. అయితే ఈ వ్యాధిబారిన ఎంతమందిపడ్డారు? ఇది ఎటువంటి అంటువ్యాధి? అనే విషయాలను మాత్రం తెలియరాలేదు.
కాగా, దేశంలో కొత్తగా గురువారం (16,2022)26,010 మంది జ్వర లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపింది. దీంతో దేశంలో జ్వర సంబంధిత కేసులు 40,56,000 చేరాయి. కాగా తమ దేశంలోకి కోవిడ్ చొరబడలేదు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో టెస్టింగ్ కిట్ లు కూడా లేని పరిస్థితి ఉంది.