LOTTERY
Lottery Rs.16,500 Crores : అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అజ్ఞాత వ్యక్తిని అదృష్టం వరించింది. ఆయన కొన్న పవర్ బాల్ టికెట్ (లాటరీ)కు కనీవినీ ఎరగని రీతిలో సుమారు రూ.16,500 కోట్లు (2.04 బిలియన్ డాలర్లు) జాక్ పాట్ తగిలింది. తల్లాహాస్సీలోని ఫ్లోరిడా లాటరీ డ్రా స్టూడియోలో తీసిన డ్రాలో 10, 33, 41, 56 నంబర్ల టికెట్లకు లాటరీ తగిలింది.
వీటిలో 10 నంబరు.. రెడ్ పవర్ బాల్ 10గా నిలిచింది. అల్టాడెనాలోని జోస్ సర్వీస్ సెంటర్ విక్రయించిన టికెట్కు ఆ నంబరు తగిలింది. అయితే ఇప్పటివరకూ ఆ వ్యక్తి ఎవరనేది తెలియలేదు.