Onam Bumper Lottery: అదృష్టమంటే ఈ ఆటో డ్రైవర్‌దే.. రూ.500 లాటరీ టికెట్‌తో రూ. 25కోట్లు గెలుచుకున్న యువకుడు

కేరళ రాష్ట్రంకు చెందిన ఆటో డ్రైవర్ జాక్‌పాట్ కొట్టాడు. రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఒక్క లాటరీతో తనజీవితం మొత్తం మారిపోయింది. లాటరీ ద్వారా వచ్చినసొమ్ము అరకోటి, రెండుకోట్లు కాదు.. ఏకంగా రూ. 25కోట్లు గెలుచుకున్నాడు.

Onam Bumper Lottery: అదృష్టమంటే ఈ ఆటో డ్రైవర్‌దే.. రూ.500 లాటరీ టికెట్‌తో రూ. 25కోట్లు గెలుచుకున్న యువకుడు

Onam Bumper Lottery

Onam Bumper Lottery: కేరళ రాష్ట్రంకు చెందిన ఆటో డ్రైవర్ జాక్‌పాట్ కొట్టాడు. రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఒక్క లాటరీతో తనజీవితం మొత్తం మారిపోయింది. లాటరీ ద్వారా వచ్చినసొమ్ము అరకోటి, రెండుకోట్లు కాదు.. ఏకంగా రూ. 25కోట్లు గెలుచుకున్నాడు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీవరాంహం ప్రాంతంలో అనూప్ నివాసం ఉంటున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓనం బంపర్ లాటరీలో శనివారం టికెట్ కొనేందుకు వెళ్లిన అతడు తొలుత వేరే టికెట్‌ను తీసుకున్నాడు. తర్వాత దాన్ని వెనక్కి ఇచ్చేసి మరో టికెట్ తీసుకున్నాడు. ఈ టికెట్టే అతన్ని రాత్రికిరాత్రే కోటీశ్వరుడిని చేసింది. ఆదివారం కేరళ రాజధాని గోర్కీ భవనంలో జరిగిన లక్కీడ్రా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కేఎన్ బాలగోపాల్ విజేత నెంబర్ ను ఎంపిక చేశాడు. అందులో మొదటి బహుమతిని అనూప్ గెలుచుకున్నాడు.

Lottery : అదృష్టం అంటే వీరిదే…లాటరీలో రూ.10 కోట్లు గెలుచుకున్న తమిళనాడు వాసులు

ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. రూ.500 లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేసేందుకు తన కుమారుడి పిగ్గీబాక్స్‌ని పగలగొట్టి మరీ లాటరీ టికెట్ ను అనూప్ కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా అనూప్ మాట్లాడుతూ.. మొదట్లో నేను నమ్మలేకపోయాను. నా భార్యను రెండుసార్లు తనిఖీ చేయమని అడిగాను. దేవుడిదయవల్ల మొదటి బహుమతిని గెలుచుకున్నానని తెలిపాడు. అయితే అనూప్ కు గెలుచుకున్న సొమ్ములో పన్నుల చెల్లింపు, ఇతరత్రా చెల్లింపులకు పోను రూ. 16.25కోట్లు అనూప్ చేతికిరానున్నాయి. ఆ డబ్బుతో కొత్త ఇంటిని నిర్మించుకుంటానని, అప్పులను తీర్చేస్తానని అనూప్ తెలిపాడు.

Angry Bull Attacks Biker : షాకింగ్ వీడియో.. వేగంగా వస్తున్న బైకర్‌ను కోపంతో ఢీకొట్టిన దున్నపోతు.. కారణం ఏంటో తెలిస్తే షాకే

లాటరీలో రూ. 25కోట్లు గెలుచుకోవటంతో మలేసియా వెళ్లే నిర్ణయాన్ని అనూప్ వాదాయి వేసుకున్నాడు. మలేసియా వెళ్లి షెఫ్‌గా పనిచేసేందుకు అనూప్ సిద్ధమయ్యాడు. అయితే ఇందుకోసం బ్యాంక్ లోన్ కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ లోన్‌సైతం ఆదివారమే కన్ఫర్మ్ అయింది. అయితే లోన్ ను అనూప్ తిరస్కరించాడు. ఈ ఏడాది ఓనం బంపర్‌ లాటరీకి ఆదరణ పెరిగింది. మొత్తం 66.54 లక్షల ఓనం లాటరీ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది 54 లక్షల సంఖ్యను అధిగమించాయి.