Angry Bull Attacks Biker : షాకింగ్ వీడియో.. వేగంగా వస్తున్న బైకర్‌ను కోపంతో ఢీకొట్టిన దున్నపోతు.. కారణం ఏంటో తెలిస్తే షాకే

శబ్ద కాలుష్యం ఎంత ప్రమాదకరమో తెలియజెప్పే ఘటన ఇది. శబ్ద కాలుష్యం వల్ల జరిగే నష్టాల్లో ఇదొక ఉదాహరణ. శబ్ద కాలుష్యం వల్ల మనుషులకే కాదు జంతువులకీ పిచ్చ కోపం వస్తుందని, అవి కూడా డిస్ట్రబ్ అవుతాయని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన.

Angry Bull Attacks Biker : షాకింగ్ వీడియో.. వేగంగా వస్తున్న బైకర్‌ను కోపంతో ఢీకొట్టిన దున్నపోతు.. కారణం ఏంటో తెలిస్తే షాకే

Angry Bull Attacks Biker : శబ్ద కాలుష్యం ఎంత ప్రమాదకరమో తెలియజెప్పే ఘటన ఇది. శబ్ద కాలుష్యం వల్ల జరిగే నష్టాల్లో ఇదొక ఉదాహరణ. శబ్ద కాలుష్యం వల్ల మనుషులకే కాదు జంతువులకీ పిచ్చ కోపం వస్తుందని, అవి కూడా డిస్ట్రబ్ అవుతాయని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన. రోడ్డుపై సైలెంట్ గా నడుచుకుంటూ వెళ్తున్న ఓ దున్నపోతు సడెన్ గా వైల్డ్ గా రియాక్ట్ అయ్యింది. ఎదురుగా వస్తున్న బైకర్ ను తలతో బలంగా ఢీకొట్టింది. అంతే, ఆ బైకర్ గాల్లో ఎగిరిపడ్డాడు. తీవ్రగాయాల పాలయ్యాడు.

ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే వివరాలు తెలియదు. కానీ, ఈ వీడియో చాలా షాకింగ్ గా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేశారు.

ఓ మహిళ, దున్నపోతు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పటివరకు దున్నపోతు చాలా ప్రశాంతంగా ఉంది. తన దారిన తాను పోతోంది. ఇంతలో ఎదురుగా ఓ బైక్ వేగంగా దూసుకొచ్చింది. పెద్ద శబ్బంతో ఆ బైక్ వచ్చింది. తన దగ్గరికి రాగానే.. దున్నపోతు ఒక్కసారిగా తలతో బైకర్ ను ఢీకొట్టింది. అంతే.. ఆ బైక్, దాన్ని నడుపుతున్న వ్యక్తి గాల్లో ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఆ బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ దున్నపోతు చేసిన పనికి దాని వెనుకే ఉన్న మహిళ బిత్తరపోయింది. ఏం జరిగిందో ఆమె అర్థం కాక కాసేపు షాక్ లో ఉండిపోయింది. గట్టిగా కేకలు వేసింది. ఆ తర్వాత రోడ్డు మీద పడిపోయిన బైకర్ దగ్గరికి వెళ్లి అతడిని లేపే ప్రయత్నం చేసింది. కానీ అతడు లేచే పరిస్థితిలో లేడు.

”శబ్ద కాలుష్యం వల్ల జరిగే నష్టాల్లో ఇదొక ఉదాహరణ. సైలెన్సర్ మార్చి బండి నడపటం వల్ల స్ట్రెస్, హై బీపీ, చెవుడు, గుండె సంబంధ వ్యాధులు వస్తాయని” ట్వీట్ చేశారు సజ్జనార్.

ఈ ప్రమాదం అస్సలు ఊహించనిది. ఇలా జరుగుతుందని, ఆ దున్నపోతు సడెన్ గా ఇంత వైల్డ్ గా రియాక్ట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. అయితే సౌండ్ పొల్యూషన్ వల్ల బెదిరిపోయిన దున్నపోతు.. ఇలా రియాక్ట్ అయ్యిందని నెటిజన్లు చెబుతున్నారు.

దున్నపోతు బైకర్ ను ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసినోళ్లు వామ్మో అంటున్నారు. చాలా షాకింగ్ గా ఉందంటున్నారు. సౌండ్ పొల్యూషన్ ఎంత ప్రమాదమో బాగా తెలిసొచ్చిందని అంటున్నారు.