Anand Mahindra : దుబాయిలో హిందూ ఆలయాన్ని సందర్శించుకున్న ఆనంద్ మహీంద్రా..

 ఇస్లామిక్ దేశం అయిన దుబాయ్ లో నిర్మించిన హిందూ దేవాలయం ఇటీవలే ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని ప్రముఖ భారత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సందర్శించుకున్నారు. యూఏఈలోని ప్రముఖ నగరం దుబాయిలో కొత్తగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని ఆనంద్ మహీంద్రా దర్శించుకున్నారు. ఆలయాన్ని దర్శించుకున్న వీడియోలను..ఫోటోలను తన ట్విట్టర్ ఫాలోవర్లతో పంచుకున్నారు.

Anand Mahindra visits Hindu temple in Dubai : ఇస్లామిక్ దేశం అయిన దుబాయ్ లో నిర్మించిన హిందూ దేవాలయం ఇటీవలే ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని ప్రముఖ భారత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సందర్శించుకున్నారు. యూఏఈలోని ప్రముఖ నగరం దుబాయిలో కొత్తగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని ఆనంద్ మహీంద్రా దర్శించుకున్నారు. ఆలయాన్ని దర్శించుకున్న వీడియోలను..ఫోటోలను తన ట్విట్టర్ ఫాలోవర్లతో పంచుకున్నారు.

‘‘దుబాయిలోని జెబెల్ అలీలో అద్భుతంగా నిర్మించి, నిర్వహించబడుతున్న కొత్త ఆలయాన్ని నేను సందర్శించుకున్నాను. అక్కడ షిర్డీ సాయిబాబా విగ్రహం కూడా ఉంది’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. వీలు చేసుకుని మస్కట్ లో ఉన్న రెండు ఆలయాలను కూడా చూసి రండి అంటూ సూచించాడు. నిజానికి దుబాయిలోని ఈ నూతన ఆలయం అక్టోబర్ 5న ప్రారంభమైంది. అదే రోజు ఆనంద్ మహీంద్రా నూతన ఆలయం వీడియోను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేయడం గమనార్హం. తదుపరి దుబాయి ట్రిప్ లో తప్పకుండా దర్శించుకుంటానని ఆయన చెప్పారు. చెప్పినట్టే 25 రోజలకే ఆయన ఆలయాన్ని సందర్శించడం కూడా పూర్తి చేశారు.

కాగా..విజయ దశమి సందర్భంగా దుబాయ్ లో ఈ హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. ఈ దేవాయలంలో కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్నారు.అలాగే షిర్డీ సాయిబాబు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయాన్ని దసరాకు ముందు రోజు భారత్, దుబాయ్ కు చెందిన ప్రముఖులు ప్రారంభించారు. 200లమంది ప్రముఖులు..దౌత్యవేత్తలతో సహఆ స్థానికంగా ఉన్న పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెబల్ అలీ ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించగా ఇదే ప్రాంతంలో 9 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిలో ఏడు చర్చిలు ఓ గురుద్వారాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొత్తగా ఈ ఆలయం కూడా కొలువైంది. దుబాయ్ లో నిర్మించి రెండో హిందూ దేవాలయం ఇదే.

ట్రెండింగ్ వార్తలు