Nasa New Pictures: నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి మరో అద్భుత చిత్రం..

నాసా శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నక్షత్రాలు జన్మించిన సృష్టియొక్క మెరిసే రాతి స్తంభాలను పోలిన చిత్రాన్ని తీసింది. అత్యంత వివరణాత్మక ప్రకృతి దశ్యాన్ని పోలిన ఈ చిత్రం..

Nasa New Pictures: నాసా శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నక్షత్రాలు జన్మించిన సృష్టియొక్క మెరిసే రాతి స్తంభాలను పోలిన చిత్రాన్ని తీసింది. అత్యంత వివరణాత్మక ప్రకృతి దశ్యాన్ని పోలిన ఈ చిత్రం.. వాయువు, ధూళి, దట్టమైన మేఘాలతో కొత్త నక్షత్రాలను సూచిస్తోంది. మూడు స్తంభాలు గంభీరమైన రాత్రి నిర్మాణాల వలె ఈ చిత్రలో కనిపిస్తున్నాయి.

Nasa Old Pictures

ఈ ఐకానిక్ సృష్టి 6,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న విస్తారమైన ఈగిల్ నెబ్యులాలో సెట్ చేయబడింది. నాసా యొక్క హబుల్ స్పేస్ టెలిస్కోప్ మొదటిసారిగా 1995లో పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్‌ను గుర్తించింది. 2014లో తిరిగి దీనిని గుర్తించినప్పుడు పదునైన స్తంభాలను పోలి ఉంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ చిత్రం పరిశోధకులకు ఈ ప్రాంతంలోని వాయువు, ధూళి పరిమాణాలతో పాటు కొత్తగా ఏర్పడిన నక్షత్రాల ఖచ్చితమైన గణనలను గుర్తించడంలో సహాయపడుతుంది. నక్షత్రాల నిర్మాణ నమూనాలను పునరుద్ధరించడానికి ఉపయోగ పడుతుంది. అదేవిధంగా మిలియన్ల సంవత్సరాలలో ఈ ధూళి మేఘాల నుండి నక్షత్రాలు ఎలా ఏర్పడతాయో, ఎలా అంతరించిపోతాయో శాస్త్రవేత్తలు అర్థంచేసుకొనేందుకు ఈ చిత్రం ఉపయోగపడుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు