FIFA World Cup Journalist Died : ఫుట్ బాల్ మ్యాచ్ లైవ్ ఇస్తూ ప్రాణాలు విడిచిన మరో జర్నలిస్టు

ఫిఫా వరల్డ్ కప్ లో మరో విషాదం నెలకొంది. రెండు రోజుల క్రితం ఫుట్ బాల్ మ్యాచ్ లైవ్ ఇస్తూ అమెరికాకు చెందిన గ్రాంట్ వహ్ల్ అనే జర్నలిస్టు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అతని మరణ వార్త మరిచిపోకముందే మరో జర్నలిస్టు మృతి చెందారు.

FIFA World Cup Journalist Died : ఫిఫా వరల్డ్ కప్ లో మరో విషాదం నెలకొంది. రెండు రోజుల క్రితం ఫుట్ బాల్ మ్యాచ్ లైవ్ ఇస్తూ అమెరికాకు చెందిన గ్రాంట్ వహ్ల్ అనే జర్నలిస్టు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అతని మరణ వార్త మరిచిపోకముందే మరో జర్నలిస్టు మృతి చెందారు. ఫుట్ బాల్ మ్యాచ్ లైవ్ అప్ డేట్ ఇస్తూ ప్రాణాలు విడిచారు. ఖతర్ కు చెందిన కాస్ టీవీ ఛానెల్ కు చెందిన ఖలీద్ అల్ మిస్లాం అనే ఫొటో జర్నలిస్టు శనివారం(డిసెంబర్10,2022)న అకస్మాత్తుగా మృతి చెందారు.

అతని మరణానికి కారాణలు తెలియలేదు. గల్ఫ్ టైమ్స్ ట్విట్టర్ వేదికగా ఖలీద్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఖతర్ లోని లూసెయిల్ స్టేడియంలో మ్యాచ్ లైవ్ ఇస్తుండగా గ్రాంట్ కు గుండెపోటు రావడంతో అతను తన కూర్చుకున్న సీటులోనే కుప్పకూలిపోయారు. దీంతో వైద్య సిబ్బంది అతనికి అత్యవసర చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు.

FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్.. రెయిన్‌బో టీషర్ట్ ధరించినందుకు జర్నలిస్టుకు స్టేడియంలోకి నో ఎంట్రీ

అతను మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా గ్రాంట్ ది సహజ మరణం కాదని అతని సోదరుడు ఆరోపించారు.  ఎందుకంటే నవంబర్ 21న గ్రాంట్ ఎల్జీబీటీ కమ్యూనిటీకి మద్దతుగా రెయిన్ బో బొమ్మ ఉన్న టీ షర్ట్ ధరించాడు. దీంతో తనను అమెరికా వేల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు సెక్యూరిటీ గార్డు అనుమతించలేదని గ్రాంట్ ట్వీట్ చేశారు.

‘నువ్వు ఈ టీషర్ట్ మార్చుకోవాలి. ఈ టీషర్ట్ తో నిన్ను లోపలికి అనుమతించను’ అని సెక్యూరిటీ గార్డు అనుమతించలేదని గ్రాంట్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ నేపథ్యంలో అతని సోదరుడు అనుమానం అనుమానం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు